మరికొద్దిరోజుల్లోనే ఈ ఏడాది ముగిసిపోయి కొత్త సంవత్సరం రాబోతోంది. కొత్త సంవత్సరాన్ని కొత్తగా ప్రారంభించాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌కి సంబంధించి చాలామంది కొత్త కొత్త ప్లాన్స్ వేసుకుంటారు. కొత్త సంవత్సరంలో కొంతమంది ఫలానాది సాధించాలని ఒక కొత్త గోల్ పెట్టుకుంటారు. ఇక సెలబ్రెటీలు కూడా ఇలాంటివి పెట్టుకుంటారు. ఈ ఏడాది లాక్డౌన్ వల్ల షూటింగ్‌లు బంద్ కావడంతో సెలబ్రెటీలందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడు లాక్డౌన్ ముగిసిపోయి షూటింగ్‌లు మొదలుకావడంతో బిజీ షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్నారు.
అయితే కొత్త ఏడాది కొంతమంది సెలబ్రెటీలకు స్పెషల్‌గా మారనుంది. కొత్త ఏడాదిలో వీళ్లు బిడ్డకు జన్మనివ్వనున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ప్రస్తుతం గర్భవతిగా ఉండగా.. కొత్త ఏడాదిలో బిడ్డకు జన్మనివ్వనుంది. తాను గర్భవతి అయినట్లు ఈ ఏడాది ఆగస్టులో అనుష్క శర్మ వెల్లడించింది. జనవరిలో ఈమె బిడ్డకు జన్మనిచ్చే అవకాశముంది. ఇక మరో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌కు ఇప్పటికే 3 ఏళ్లు బిడ్డ ఉండగా.. కొత్త సంవత్సరంలో మరో బిడ్డకు జన్మనివ్వనుంది.
ఇక టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ భార్య సాగరికా ఘాట్గే కూడా కొత్త ఏడాది బిడ్డకు జన్మనివ్వనుంది. ఇక మరో నటి తేజై సిద్ధూ , అనితా హసానందాని రెడ్డి జీవితాల్లోకి కూడా కొత్త సంత్సరంలో బిడ్డకు జన్మనివ్వనున్నారు.