గొర్రె పురాణం సినిమా ప్రమోషన్లలో హీరో సుహాస్ కనిపించక పోవడంతో రకరకాల పుకార్లు వచ్చాయి. దాంతో సినిమా ఫలితంపై కూడా ప్రభావం పడిందని కొంతమంది అభిప్రాయం. ఫలితం ఎలా ఉన్నా తెలుగులో సెటైరికల్ సినిమాలు చేసే దర్శకులు చాలా అరుదు. ఇలాంటి సమయంలో బాబీ అనే దర్శకుడు గొర్రె పురాణం సినిమాతో బోల్డ్ అటెమ్ట్ చేశారు. హిందీలో వచ్చిన పీపిలీ, పీకే చిత్రాలకు దగ్గరగా ఈ చిత్రం ఉంది. ఇండియా సినిమాలో రాజ్ హిరానీ వంటి దర్శకులు చాలా ఆదు. గొర్రె పురాణం సినిమాతో దర్శకుడు బాబీ వారి వరుసలో చేరారు అని చెప్పవచ్చు.
గొర్రె పురాణం సినిమాలో పోస్టర్ల మీద మొత్తం సుహాస్ కనిపించినా.. సినిమాలో ఆయన పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది. దాని వలన మొదటి రోజు చూసిన ప్రేక్షకులు కొంత అసంతృప్తికి లోనయ్యారు. దాంతో మొదటి రోజు పబ్లిక్ టాక్ అంతంత మాత్రమే ఉన్నా క్రమంగా మంచి టాక్ తో విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది.
గొర్రెతో సినిమా చేయడం అంత చిన్న విషయం కాదు, గొర్రెను ఒక పాత్రగా తెరపై చూపించడం అంటే ఎంత కష్టపడాలో అది మేకర్స్ కు మాత్రమే తెలుసు. అలాంటిది ఎక్కడా వీఎఫ్ఎక్స్ వాడకుండా నిజమైన గొర్రెతో సినిమా తీసిన దర్శకుడి ప్రతిభ మెచ్చుకోదగినది, ఈ విషయంలో దర్శకుడు బాబీ విజయం సాధించాడు అని చెప్పాలి. అందుకే బాబీకి మంచి ప్రశంసలు అందుతున్నాయి.
చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన గొర్రె పురాణం సినిమాకు సరైన పబ్లిసిటీ లేకపోయినా, హీరో సుహాస్ సపోర్ట్ ఇవ్వకపోయినా, ప్రేక్షకుల మౌత్ టాక్ తో దూసుకెళ్తుంది. తాజాగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్క్ ను దాటడం విశేషం. సినిమా చూస్తే ఎంత తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించారో అర్థమవుతుంది. ఈ బడ్జెట్లో ఇంత మంచి సెటైరికల్ సినిమా తీయడంలో డైరెక్టర్ బాబి సక్సెస్ అయ్యాడు. అయితే మలయాళం సినిమాల్లో కంటెంట్ ఉంటుందని, ల్యాగ్ ఉన్నప్పటికీ మన వాళ్ళు ఆదరిస్తారు. ఇదే గొర్రె పురాణం సినిమా విషయంలో కంటెంట్ ఉంది కానీ, ల్యాగ్ ఉందని విమర్శిస్తున్నారు. అందరూ ఒక్క విషయన్ని ఆలోచించాలి ఇలాంటి సినిమాలు ఆదరించకపోతే కంటెంట్ ఉన్న సినిమాలో రావడం తగ్గుతాయి.
నటీనటులు : సుహాస్, పోసాని కృష్ణమురళి, రఘు తదితరులు.
దర్శకుడు : బాబీ
నిర్మాత : ప్రవీణ్‌రెడ్డి
సంగీత దర్శకుడు : పవన్ సి.హెచ్
సినిమాటోగ్రఫీ : సురేష్ సారంగం
బ్యానర్ : ఫోకల్ వెంచర్స్