కల్కి నుండి సర్ప్రైజ్

ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898AD నుండి అమెజాన్ లో ఒక కొత్త వీడియో విడుదల చేసారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి ఇటీవలే బుజ్జి & భైరవను పరిచయం చేస్తూ ఒక ఈవెంట్ చేసారు. ఆ ఈవెంట్ చాల మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. అయితే విషయానికి వస్తే కల్కి 2898AD అనే సినిమా నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వాళ్ళ రెండు సార్లు వాయిదా పడుతూ ఇప్పుడు చివరికి జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది ఇలా ఉండగా సినిమా పోస్టుపోన్ అవుతూ లేట్ కావడం తో మేకర్స్ అమెజాన్లో ఒక వీడియో విడుదల చేసారు. ఆ వీడియోలో ప్రభాస్ వెల్డింగ్ లు చేస్తూ ఉండగా కొంత మంది పిల్లలు ప్రభాస్ దగ్గరకు వచ్చి కోపం గా ఇంకెన్నాళ్లు వెయిట్ చేయాలి, ముసలివాళ్ళం అయిపోతున్నాం, సెల్లవులు కూడా అయిపోతున్నాయి అని అనగా ప్రభాస్ బుజ్జి ని సర్ప్రైజ్ ఇద్దామా అని అడుగుతాడు. దానికి బుజ్జి కూడా ఓకే చెప్పడంతో ఈ నెల 31న ఒక సర్ప్రైజ్ వీడియో విడుదల చేస్తున్నట్లు ప్రభాస్ చెప్పడంతో ఆ వీడియో ముగుస్తుంది. ఇక ఆ సర్ప్రైజ్ వీడియో ఎం అయ్యి ఉంటుందో, ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.