‘పుష్ప-2’ నుంచి స్పెషల్ పోస్టర్

అల్లు అర్జున్-రష్మిక జంటగా నటిస్తున్న పుష్ప-2 రిలీజ్ (డిసెంబర్ 6)కు మరో 50 రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో మేకర్స్ ఐకాన్ స్టార్ స్పెషల్ పోస్టర్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సీరియస్ గా కుర్చీలో కూర్చొన్న బన్నీ లుక్ ఆకట్టుకుంటోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, అజయ్ ఘోష్, రావు రమేశ్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అయితే ఇప్పటికే ఈ సినిమా పై అటు అల్లు అర్జున్ అభిమానులకు, అలాగే సినిమా లవర్స్ కి ఎన్నో అంచనాలు ఉన్నాయ్. కాగా కొంత మంది సినీ వర్గాలలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని బిజినెస్స్ లు పూర్తి చేసుకుని ఇప్పటికే లాభాలలో ఉన్నట్లు మాటలు వినిపిస్తున్నాయి అంటున్నారు. ఈ లెక్కలు చూస్తుంటే మరోసారి అల్లు అర్జున్ మంచి హిట్ కొట్టేసినట్లె అనుకోవాలి. అంతే కాక ఇటీవలే ఆ సినిమా సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సినిమా ఫస్ట్ హాఫ్ చూసాను అని, ప్రతి సీన్ చాల బాగా వచ్చినట్లు ఆయన చెప్పారు. అదే విధంగా నిర్మాత ఎస్ కె ఎన్ కూడా ఓ సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో పుష్ప 2 కు సంబంధించి కొన్ని సీన్ లు చూసినట్లు తెలిపారు. ఆయన కూడా చాల పాజిటివ్ గా స్పందించడంతో ఈ సినిమా కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ కొట్టబోతుంది అని అందరూ అనుకుంటున్నారు.