మే 24న `నేను లేను` విడుదల

nenu lenu movie

ఓ.య‌స్‌.యం విజన్ – దివ్యాషిక క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `నేను లేను`. `లాస్ట్ ఇన్ లవ్` అనేది ఉప‌శీర్షిక‌. హ‌ర్షిత్ హీరో. రీసెంట్ గా విడుదల చెసిన ఈ చిత్రం ట్రైలర్ 7.5 మిలియన్ వ్యూస్ ను అందుకుంది.

ఈ చిత్రం గురించి ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ మాట్లాడుతూ -“ఒక అందమైన ప్రేమకథతో తెర‌కెక్కిన‌ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి క‌ట్టిస్తుంది. ట్రైలర్ కి అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. 7.5 మిలియన్ వ్యూస్ ను మా ట్రైలర్ రీచ్ అయింది.రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా థ్రిల్లింగ్ కాన్సెప్టుతో తీసిన సినిమా ఇది. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అనే నమ్మకం ఉంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.యు/ఎ సర్టిఫికేట్ లభించింది. ‌

మే 24న సినిమాను విడుదల చేస్తున్నాం. ఇండియన్ సినిమా స్క్రీన్ పై ఇప్పటివరకు రానీ చూడని సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రమిద‌ని అన్నారు.

హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌, రుద్ర‌ప్ర‌కాశ్‌, వేల్పుల‌ సూరి, యుగంధ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ఆశ్రిత్‌, ఛాయాగ్ర‌హ‌ణం:ఎ. శ్రీ‌కాంత్ (బి.ఎఫ్‌.ఎ), నృత్యాలు: జోజో, నిర్వాహ‌ణ: సురేష్‌కూర‌పాటి, పి.ఆర్‌.ఓ‌:సాయి స‌తీష్ పాల‌కుర్తి, విఎఫ్ఎక్స్: ప్రభురాజ్‌, ఎస్.ఎఫ్.ఎక్స్:పురుషోత్తం రాజు, ఆడియోగ్ర‌ఫీ:రంగ‌రాజ్‌, క‌ల‌రిస్ట్ః క‌ళ్యాణ్ ఉప్పాల‌పాటి, ప్ర‌చార చిత్రాలు: శ్రీ‌క‌, స‌హాయ‌ద‌ర్శ‌కులు: జె.మోహ‌న్‌కాంత్‌, ద‌ర్మేంద్ర‌, సురేశ్‌, స‌హ‌నిర్మాత : య‌షిక, నిర్మాత : సుక్రి కుమార్, రచన- దర్శకత్వం : రామ్ కుమార్ ఎమ్.ఎస్.కె.