పెళ్లైన రెండు నెలలకే గర్భవతి అయిన సింగర్

పెళ్లైన రెండు నెలలకు ఒక ప్రముఖ బాలీవుడ్ టాప్ సింగర్ గర్భవతి కావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రముఖ బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ అక్టోబర్ 26న పంజాబీ సింగర్ రోహన్ ప్రీత్ సింగ్‌ను పెళ్లి చేసుకుంది. కరోనా నేపథ్యంలో ఢిల్లీలో కొంతమంది బంధువులు, సన్నిహితుల మధ్య మాత్రమే ఈ పెళ్లి జరిగింది. ఆ తర్వాత ముంబైలో రిసెప్షన్ ఫంక్షన్‌ను ఏర్పాటు చేయగా.. ఆ తర్వాత దుబాయ్ వెళ్లి హానీమూన్ కూడా పూర్తి చేసుకున్నారు.

NEHAKAKKAR

అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్తతో కలిసి నేహా కక్కర్ పెట్టిన పెట్టిన చర్చనీయాంశంగా మారింది. ఇందులో తాను గర్భవతి అయినట్లుగా ఆమె పొట్టపై చేయి పెట్టుకుని కనిపించింది. ఇక భర్త రోహన్ ప్రీత్ కూడా నవ్వుతూ ఈ ఫొటోలో కనిపించాడు. ఈ ఫొటోపై రోహన్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. ఇప్పటినుంచి నిన్ను ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలని అని కామెంట్ చేశాడు. దీంతో పెళ్లైన రెండు నెలలకే గర్భవతి ఎలా అయిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

తాను గర్భవతి అనే విషయాన్ని ఆమె ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఫొటోలను చూస్తుంటే మాత్రం ఆమె గర్భవతి అనే విషయం అర్ధమవుతోంది. ఇక వీరిద్దరిది ప్రేమ వివాహం అనే విషయం తెలిసిందే. నేహా కక్కర్ తెలుగులోనూ పలు పాటలు పాడింది. తన పాటలతో ఆమె ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.