పవన్ ‘వకీల్ సాబ్’ లుక్ లీక్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమా కోసం అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పవన్ చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమా చేస్తుండటంతో… దీనిపై పవన్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమాను తెలుగులోనే ‘వకీల్ సాబ్’ పేరుతో వస్తోంది. వేణు శ్రీరామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా.. బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

PAWAN KALYAN

ఇందులో లాయర్ పాత్రలో పవన్ నటిస్తుండగా.. ముగ్గురు హీరోయిన్లు ఇందులో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలవ్వగా.. సోషల్ మీడియాలో ఇది ట్రెండింగ్ సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని పవన్ లుక్ లీక్ అయింది. హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో రాత్రి పవన్ పాల్గొన్న ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.

షూటింగ్ పూర్తైన తర్వాత డైరెక్ట్‌గా అవే దుస్తుల్లో దిల్ రాజు బర్త్ డే ఫంక్షన్‌కు పవన్ హాజరయ్యాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అవ్వగా.. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగనున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.