బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన అగ్ర తారలను ఇటీవల నార్కోటిక్ కంట్రొల్ బ్యూరో విచారించిన విషయం తెలిసిందే. దీపికా పదుకొనె, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ ల యొక్క మొదటిరోజు ఇన్వెస్టిగేషన్ ముగిసింది. అయితే వారి నుంచి NCB అధికారులు ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ ఫోన్ చాట్ ద్వారా డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ముగ్గురిని ఇంకా వివిధ కోణాల్లో విచారించాలని అధికారులు రెడీ అవుతున్నారు.
ముందుగా వారి ఫోన్లను సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్, రియా మేనేజర్ జయ సాహా ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కేదార్‌నాథ్ షూటింగ్ సందర్భంగా సారా ఉపయోగించిన ఫోన్‌ను సమర్పించాలని కోరినట్లు సమాచారం. వారి ఫోన్లు ఇప్పుడు ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపినట్లు తెలుస్తోంది. ఇక వీరికి తప్పితే ఎన్‌సిబి ఇప్పటి వరకు ఎవరికీ సమన్లు పంపలేదని డిడిజి ముతా అశోక్ జైన్ పేర్కొన్నారు. అయితే, ఎన్‌సిబి తన ప్రకటనతో సంతోషంగా లేనందున దీపికాను మళ్లీ పిలిపించవచ్చని సమాచారం.