పట్టపగలే చుక్కలు చూపిస్తోంది

నయనతార కోలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ గా ఎంటర్ అయ్యి, స్టార్ స్టేటస్ అందుకోని ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. ఒక పక్క స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ నటిస్తూనే, సోలోగా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ప్రతి మూవీకి తన మార్కెట్ పెంచుకుంటుంది. ప్రస్తుతం రజినీతో దర్బార్, విజయ్ తో బిగిల్, చిరుతో సైరా, నివిన్ పౌలితో లవ్ యాక్షన్ డ్రామా సినిమాలు చేసిన నయన్, రీసెంట్ గా ఒక ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీని స్టార్ట్ చేసింది. రజినీకాంత్ హిట్ సినిమా టైటిల్ నెట్రికన్, ఇదే పేరుతో మూవీ చేస్తున్న నయన్ ఈ మూవీలో బ్లైండ్ అమ్మాయిగా కనిపించనుంది.

స్టార్లతో సంబంధం లేకుండా తానై సినిమాలను నడిపిస్తూ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న నయన్ నెట్రికన్ కోసం ఆరు కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. మిలింద్‌ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని నయన్ బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సైరా, బిగిల్, దర్బార్ సినిమాలకి కూడా నయన్ ఆరు కోట్లే తీసుకుందని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. ఇదే నిజమైతే నయన్ స్థాయిని ఇప్పట్లో టచ్ చేయడం ఏ హీరోయిన్ కైనా కష్టమే. ఇదిలా ఉంటే ఇటీవల రీసెంట్ గా విఘ్నేష్‌ శివన్‌ పుట్టిన రోజు వేడుకలో పాల్గొని నయనతార సందడి చేశారు. అటు విఘ్నేష్‌, ఇటు నయనతార బ్లాక్‌ కలర్‌ డ్రెస్‌లో సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.