వీరుడికి నివాళి… ఆ రోజే

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ చరణ్, రాజమౌళిల హ్యుజ్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జట్ చిత్రం ఆర్ ఆర్ ఆర్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రీసెంట్ గా బల్గెరియా షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ట్రిపుల్ ఆర్ లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది, రామ్ చరణ్ కి సంబందించిన సీన్స్ ఈ షెడ్యూల్ లో షూట్ చేస్తారని సమాచారం. ఆన్ సెట్స్ నుంచి ఒక్క ఫోటో కూడా లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్న జక్కన, త్వరలో ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తాడని సమాచారం.

అక్టోబర్ 22న కొమరంభీమ్ జయంతి సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఆ పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ లుక్ ని చిత్ర యూనిట్ రివీల్ చేయనున్నారు. అయితే ఈ విషయాన్ని యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు కానీ 2020 జులై 30నే ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అనుకుంటున్నారు కాబట్టి, వచ్చే ఏడాది కొమరం భీం జయంతి వచ్చే లోపు సినిమా అయిపోతుంది. సో రాజమౌళి ఆ సాయుధ పోరాట యోధుడికి నివాళిగా అక్టోబర్ 22న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ట్రిపుల్ సినిమాలో చరణ్ ఎన్టీఆర్ లు ఎలా ఉంటారు అనే ఆలోచనతో మెగా నందమూరి అభిమానులు చాలా ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ చేశారు. ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ఒరిజినల్ ని తలపించేలా ఉంటే ఇక రాజమౌళి రిలీజ్ చేయబోయే ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పాన్ ఇండియా చిత్రంగా రాబోతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాని డి. వి. వి దానయ్య నిర్మిస్తున్నారు.