ఈరోజు ఉగాది సందర్భంగా ఈ ‘లవ్, మౌళి’ సినిమా ట్రైలర్ యువ కథానాయకుడు విశ్వక్ సేన్ చేతుల మీదుగా విడుదల చేశారు. 4.15 సెకండ్స్ నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో నవదీప్ తన నటనతో అందరి ప్రశంశలు పొందారు. మౌళి క్యారక్టర్ లో లేయర్స్, విజువల్స్ అన్ని కూడా చాలా కొత్తగా ఉన్నాయి. ఈ ట్రైలర్ లాంచ్ లో చిత్ర దర్శకుడు, నటీ నటులు పాల్గొన్నారు.
చీఫ్ గెస్ట్ విశ్వక్సేన్ మాట్లాడతూ… నాకు ఎందుకో నవదీప్ తో ఒక పర్సనల్ కనెక్షన్ ఉంటుంది, నేను పదేళ్ళ క్రితం బంజారహిల్ల్స్ వచ్చినప్పుడు ఎక్కడ చూసినా, విన్నా నవదీప్ ఏ ఉండేవాడు, అలాంటి లైఫ్ ఉంటె బాగుండు అనుకున్నాను. మనం ఏదైనా గట్టిగా అనుకుంటే అది అవుతుంది, లవ్, మౌళిలో లాగా నేను కూడా ఒక్కడినే అలా ట్రిప్స్ కి వెళ్ళిపోతాను, ముఖ్యంగా కొండ ప్రాంతాలకి, నేను ఏదైతే ఒక ప్లేస్ లో కూర్చుని, నా లైఫ్ లో ఎలా ఎదగాలి అని అనుకున్నాను, కొన్ని సంవత్సరాలకి నేను అదే ప్రదేశంలో షూటింగ్ చేశాను, నేను అనుకున్న పోసిషన్ కి రీచ్ అవుతున్నాను. నవదీప్ కి ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.
హీరో నవదీప్ మాట్లాడుతూ… ఈ కథ విన్నప్పుడు, అవనీంద్ర నన్ను గడ్డం చేసుకోవద్దు, జుట్టు పెంచు, బాడీ బిల్డ్ చెయ్ అని చెప్పారు, నేను దాదాపుగా ఒక సంవత్సర కాలం అదే పనిలో ఉన్నాను, నా కష్టాన్ని చూసిన నా ఫ్రెండ్స్, ‘అసలు నీకేం కావలిరా?’ అని అడిగి, ఈ సినిమాకి వాళ్ళు చెయ్యలిసింది చేశారు. నిజానికి వాళ్ళు లేకపోతే ఈ సినిమా అయ్యేది కాదు. చాలా కొత్త కథ, దానికి తగ్గా లొకేషన్స్ అన్ని కలిసొచ్చాయి. ఈ సినిమా ట్రైలర్ ని వేరు వేరు ఊర్లల్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం, దానికి ఒక రూట్ మ్యాప్ కూడా ఏలూరు శ్రీను గారు ఇచ్చారు, దానికి ‘ప్రేమ యాత్ర’ అని పేరు కూడా పెట్టాము, త్వరలో మీకు డీటెయిల్స్ రిలీజ్ చేస్తాను.
హీరోయిన్ భావన మాట్లాడుతూ… ఈ సినిమా ఒక యునీక్ ప్రాజెక్ట్. ప్రతి ఒక్కరు ఏదో ఒక క్యారెక్టర్ తో రిలేట్ అవుతారు. డైరెక్టర్ అవనీంద్ర ఒక కొత్త కథతో వచ్చారు. నవదీప్ తప్ప మౌళి రోల్ ని ఇంకేవ్వరు చెయ్యలేరు. నిజమైన ప్రేమకు ఒక రానెస్ ఉంటుంది, అది అందరికి ఒకేలా ఉంటుంది.
మిర్చి కిరణ్ మాట్లాడుతూ… నిజానికి ఈ సినిమాలో నా షూటింగ్ రెండు రోజులు మాత్రమే, కాని నేను ఈ సినిమా యూనిట్ ప్యాషన్ నచ్చి వారితో రెండు వారాలు ఉండిపోయాను. ప్రొడ్యూసర్ రూమ్ అడిగితే ఎమంటారో అని అసిస్టెంట్ డైరెక్టర్ రూమ్ లో ఉన్నాను. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా టీం అంతా చాలా కష్టపడి చేశారు.
పంఖురి గిద్వాని మాట్లాడుతూ… ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరితో నాకు ఎమోషనల్ జర్నీ ఉంది. ఈ కథ కోసం మ్యూజిక్, కెమెరా వర్క్, డైరెక్టర్ అందరు సమిష్టిగా కృషి చేశారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ అవనీంద్ర మాట్లాడుతూ… కోవిడ్ ఈ కథ రాయడానికి చాలా హెల్ప్ చేసింది, అసలేం కథ రాయాలి? ఎలా రాయాలి? అనే ఆలోచనలోనే ఒక సంవత్సరం గడిచిపోయింది. కథ ఎప్పుడైతే అయ్యిందో, అప్పుడు నాకు ఈ మౌళి పాత్రకి నవదీప్ అయితేనే సర్రిగ్గా సరిపోతాడని, నవదీప్ తో అప్పటి నుండి ట్రావెల్ అవ్వడం మొదలు పెట్టాను, నవదీప్ కి సినిమా అంటే ఎంత ప్యాషన్ అంటే, తను నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా, నా ఎక్సిక్యుటివ్ ప్రొడ్యూసర్ గా, నా హీరోగా, కొని సార్లు నా ఆఫీస్ బాయ్ గా కూడా వ్యవహరించే వాడు. సినిమా అంటే నవదీప్ కి అంత ఇష్టం.
నటీ నటులు:
నవదీప్, పంఖురి గిద్వాని, భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్.
సాంకేతిక నిపుణులు:
నిర్మాతలు: సి స్పేస్, నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్
దర్శకుడు: అవనీంద్ర
మ్యూజిక్ డైరెక్టర్: గోవింద్ వసంత్
బాక్గ్రౌండ్ స్కోర్: క్రిష్ణ
లిరిక్స్: అనంత శ్రీరామ్
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ మామిడి
కొరియోగ్రాఫేర్: అజయ్ శివశంకర్
కాస్టుమ్ డిసైనర్: ఆన్షి గుప్త
డి ఐ: పోయిటిక్ స్టూడియోస్ (కోచ్చి)
వి ఎఫ్ ఎక్స్: నాగు
సౌండ్ డిజైన్: ధ్వని స్టూడియోస్