నేచురల్ స్టార్ నాని తన అప్ కమింగ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోద శనివారం’లో సూర్య పాత్రలో మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ పవర్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ అడ్రినలిన్‌తో కూడిన యూనిక్ అడ్వంచర్ ని భారీ కాన్వాస్‌పై హై బడ్జెట్‌తో డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
తాజాగా చిత్ర బృందం క్లైమాక్స్ షూటింగ్‌ను ప్రారంభించింది. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో హ్యుజ్ సెట్‌ను నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి
బ్యానర్: డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మురళి జి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్