భారతదేశ చరిత్రలో చత్రపతి శివాజీ మహారాజ్ అంటే తెలియని వారు లేరు. అంతటి గొప్ప మహారాజు కుమారుడు సంబాజీ మహారాజ్. చరిత్రలో ఇతని గురించి ఎక్కువగా లేఖ పోయినప్పటికీ తన తండ్రి రాజసానికి తగ్గట్లు సంబాజీ పరిపాలన కూడా ఉండేదని కొన్నిచోట్ల వింటూ ఉంటాము. అంతేకాక హైందవ ధర్మం కోసం సామాజిగూడ తన తండ్రి వలె ఎంతో కృషి చేసినట్లు తెలుస్తుంది. అంతటి మహారాజు సంభాజీ జీవిత చరిత్ర గురించి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో చిత్రం రాబోతుంది. ఆ చిత్రం పేరే చావా. విక్కీ కౌశల్ శంబాజీ మహారాజ్ పాత్రలో నటిస్తుండగా తనతో జంటగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న శంబాజీ మహారాజ్ భార్య అయిన ఏసుభాయ్ పాత్ర పోషించనుంది. ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కారణంగా ఈ చిత్ర ట్రైలర్ రేపు విడుదలకు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ చిత్రం నుండి రష్మిక మందన్న లుక్ ను చిత్ర మేకర్స్ విడుదల చేశారు. రాజులనాటి వేషధారణలో రష్మిక మందన్న ఒక మహారాణి రూపంలో ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా ఎంతో అందంగా ఉన్నారు. ఇప్పటివరకు చూడనీలకు కావడంతో అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఆమెను ఎంతగానో అభినందిస్తున్నారు.