కుటుంబ సభ్యుల నేపథ్యంలో నారా రోహిత్ ఎంగేజ్మెంట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు గారి కుమారుడే నారా రోహిత్. అయితే సుమారు 15 సంవత్సరాలుగా 25 సినిమాల్లో హీరోగా నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు నారా రోహిత్. 2009లో బాణం సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆ తర్వాత వచ్చిన సోలో సినిమాతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల వచ్చిన తన సినిమా ప్రతినిధి 2లో తన జంటన హీరోయిన్గా నటించిన సిరి లేళ్లను ప్రేమించి వివాహం చేసుకోబోతున్నాడు. ఈరోజు అనగా ఆగస్టు 13వ తేదీన ఉదయం సుమారు 9:45కు హైదరాబాదులో హోటల్ లో వీరి నిశ్చితార్థం జరిగింది. నారా, నందమూరి కుటుంబాల నుండి సుమారు 70 మంది అలాగే అమ్మాయి తరఫున 20 మంది, అదేవిధంగా ఆత్మీయులు మిత్రులు ఐదుగురు. సుమారు వందమందితో ఎంతో సింపుల్గా సిరి లేళ్ళల నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్ 15వ తేదీన వీడు ఇద్దరి ప్రేమ వివాహం ఘనంగా జరగబోతున్నట్లు సమాచారం.