మామ బాలయ్య ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా అల్లుడు నారా లోకేష్

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై బాబి కొల్లి దర్శకత్వంలో సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం డాకు మహారాజ్. ఈ చిత్రంలో నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా చేస్తుండగా బాబీ డియోల్, ఊర్వశి రహ్తుల, ప్రగ్యా జశ్వంత్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికీ ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్, ట్రైలర్ ఇంకా పాటలు మంచి బజ్ క్రియేట్ చేస్తూ చిత్రంపై అంచనాలు పెంచితూ వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలోని ఏఆర్టిఎస్ కళాశాల మైదానం జనవరి 9వ తేదీన జరగనున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రానున్నట్లు తెలుస్తుంది. మామ సినిమాకు అల్లుడు ముఖ్యఅతిథిగా రావడం మరింత ఆసక్తికరంగా మారింది.