నాని బిగ్ బడ్జెట్ మూవీ.. రిస్క్ చేయలేక వెనక్కి తగ్గిన నిర్మాతలు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ మార్కెట్ ని సెట్ చేసుకున్న హీరోల్లో నాని ఒకరు. మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో పాటు ఎమోషనల్ లవ్ స్టోరీలతో కూడా బాక్సాఫీస్ వద్ద వందర్స్ క్రియేట్ చేయగలడు. అయితే రెగ్యులర్ గా కాకుండా కాస్త కొత్తగా ఆకట్టుకోవాలని ట్రై చేసిన V సినిమా పెద్దగా క్లిక్కవ్వలేదు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ యాక్షన్ త్రిల్లర్ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే దారుణమైన రిజల్ట్ అందుకునేది అనే టాక్ వచ్చింది.

ఇక మరోసారి డిఫరెంట్ గా పిరియాడిక్ డ్రామాతో ఆకట్టుకోవాలని శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేయడానికి ఒప్పుకున్న నానికి మొదట్లోనే ఎదురుదెబ్బ తగులుతోంది. సినిమా నిర్మాతలు నానిపై అంచనాలకు మించి బడ్జెట్ పెట్టలేక చేతులెత్తేశారని టాక్ నడుస్తోంది. అందుకు V సినిమా రిజల్ట్ ఒక కారణమని రూమర్స్ వస్తున్నాయి. ఏదేమైనా నానితో అలాంటి ప్రయోగాలు చేయడం ఇష్టం లేదని నిర్మాతలు డ్రాప్ అవ్వడంతో ఈ ప్రాజెక్టు మరొకరి చేతుల్లోకి వెళ్లినట్లు సమాచారం. ట్యాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయి పల్లవి కూడా ఒక ముఖ్య పాత్రలో నటించనుంది.