రాజమౌళి బాటలో కొరటాల శివ.. RRR స్టైల్ లోనే..

టాలీవుడ్ లో ఫెయిల్యూర్స్ లేని అగ్ర దర్శకుల్లో రాజమౌళి తరవాత కొరటాల శివ ఒకరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అంచనాలకు తగ్గట్టుగా హీరోలతో మంచి సందేశాత్మక సినిమాలను రూపొందించి బాక్సాఫీస్ హిట్స్ అందుకోగల సత్తా ఉన్న ఈ దర్శకుడు నెక్స్ట్ ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

అయితే ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ పై గత కొన్ని వారాలుగా కన్ఫ్యూజన్ నెలకొంది. ఎలాగైనా స్టార్ట్ చేయాలని కొరటాల శివ ప్లాన్ వేసినప్పటిక్ పరిస్థితులు అనుకూలించడం లేదు. ఇక మెగాస్టార్ కూడా ఈ వయసులో రిస్క్ చేయడానికి ఇష్టపడటం లేదు. అయితే ఫైనల్ గా RRR కోసం టెస్ట్ షూట్ చేసినట్లుగా ఒక రెండు రోజులు రాజమౌళి ప్లాన్ ప్రకారమే కొరటాల శివ కూడా అతి తక్కువ మంది యూనిట్ సభ్యులతో హీరో లేకుండా టెస్ట్ షూట్ నిర్వహించనున్నారట. ప్లాన్ వర్కౌట్ అయితే మెగాస్టార్ ని అలాగే రామ్ చరణ్ ని కి రంగంలోకి దింపాలని చూస్తున్నారు. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.