సెన్సేషనల్ డైరెక్టర్ దర్శకత్వం ద్వారా పరిచయం కాబోతున్న నందమూరి మోక్షజ్ఞ

నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ త్వరలోనే సినిమాలలోకి రంగ ప్రవేశం చేయబోతున్నారని అందరికీ తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే నందమూరి బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ త్వరలోనే సినిమాల్లోకి అడుగు పెట్టబోతున్నాడని చాలా సందర్భాలలో చెప్పారు. నటనకై విశాఖపట్నంలో ఒకరి దగ్గర మోక్షజ్ఞ శిక్షణ తీసుకుంటున్నాడు. ఇప్పటికే మోక్షజ్ఞ లుక్ టెస్ట్ లో పాస్ కావడం జరిగింది. ఇది ఇలా ఉండగా ఇటీవలే నందమూరి అభిమానులు మోక్షజ్ఞ సినీ ప్రవేశం ఎప్పుడు అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. నందమూరి మోక్షజ్ఞ ఫోటో ఒకటి బాగా ట్రెండ్ చేశారు.

అయితే హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయి విజయం సాధించిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు తన తర్వాత సినిమా అయిన జై హనుమాన్ సినిమా తీయడంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే నందమూరి మోక్షజ్ఞ ఈ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంతో పరిచయం కాబతునట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆ సినిమాను నందమూరి బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని తన తమ్ముడు మోక్షజ్ఞ తొలి సినిమాను నిర్మించబోతునట్లు సమాచారం. అయితే మోక్షజ్ఞ జై హనుమాన్ సినిమాతో పరిచయం కాబోతున్నాడా అనుకుంటే జై హనుమాన్ సినిమాను ప్రేమ్ షో ఎంటర్టైర్మెంట్స్ వారు నిర్మిస్తున్న సంగతి తెలిసింది. మోక్షజ్ఞ తొలి సినిమా తన సోదరి నందమూరి తేజస్విని నిర్మించనుంది అనే సమాచారం ఉంది కాబట్టి ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కోసం మరొక కథ ప్లాన్ చేసి ఉంటాడని అంచనా. అయితే ఇప్పటివరకు వీటికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు కాబట్టి మోక్షజ్ఞ రాక కోసం నందమూరి అభిమానులు వేచి చూడాల్సిందే.