నిత్యసేవ కార్యక్రమాలను నందమూరి కుటుంబం

మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులైన నందమూరి రామకృష్ణ గారు, తమ కుమార్తె రూప, అలాగే మరికొందరు నందమూరి కుటుంబ సభ్యులను అభిమానులు కలిసి హాస్పిటల్ దగ్గర ఉండే పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికే తమ తల్లి బసవతారకం గారి పేరిట ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఆ హాస్పిటల్ ద్వారా నిత్యం పేద ప్రజలకు ఎన్నో వైద్య సదుపాయాలు నందమూరి కుటుంబం అందిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా ఇప్పుడు మరోసారి శివుని ఆశీస్సులతో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబ సభ్యులతోపాటు తెలుగు చిత్ర నిర్మాత మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు చురుకుగా పాల్గొన్నారు. తద్వారా సేవ చేయడం అనేది తమకు ప్రధాన లక్షణంగా మరోసారి ఈ కార్యక్రమంలో తెలియజేశారు.