కొడైకెనాల్ లో నందమూరి నటసింహం ఫ్లాష్ బ్యాక్ షూటింగ్

నంద‌మూరి బాల‌కృష్ణ 105వ చిత్రం `రూల‌ర్‌` సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జై సింహా కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ రానున్న ఈ ప్రాజెక్ట్ ని కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మెగాహీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ప్రతిరోజు పండగే సినిమాకి పోటీగా డిసెంబ‌ర్ 20న రూలర్ ని విడుద‌ల చేస్తున్నారు. రిలీజ్ దగ్గర పడుతుండడంతో స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్, లేటెస్ట్ షెడ్యూల్ అప్డేట్ ని అనౌన్స్ చేశారు.

nbk ruler

రూలర్ లేటెస్ట్ షెడ్యూల్ నవంబ‌ర్ 6 నుండి మొదలు కానుంది. కొడైకెనాల్‌లో జరగనున్న ఈ షెడ్యూల్‌ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్ తో రూలర్ షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. సోనాల్‌చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బాల‌య్య రెండు షేడ్స్‌లో న‌టిస్తున్నాడు. అందులో ఒక‌టి పోలీస్ ఆఫీస‌ర్ రోల్ కాగా.. మ‌రో పాత్ర మాఫియా డాన్ పాత్ర.