ఇది కదా బాలయ్య అభిమానులకి కావాల్సింది…

బాలకృష్ణ – పూరి జగన్నాథ్‌, ఈ ఇద్దరి కలయికలో సినిమా మొదలయ్యింది అనే వార్త బయటకి రాగానే అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు షాక్ అయ్యాయి. సినిమా కంప్లీట్ అయ్యి బయటకి వస్తుందా అనే అనుమానాలు కూడా వినిపించాయి. అయితే #NBK101 స్టంపర్ అంటూ విడుదలైన టీజర్ అందరి డౌట్స్ ని క్లియర్ చేసి పడేసింది. పైసా వసూల్ లో పూరి మార్క్ హీరోలా తనని తాను చేంజ్ చేసుకున్న బాలయ్య, చాలా యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తూ అదిరిపోయే వన్ లైనర్స్ చెప్పాడు.

పైసా వసూల్ సినిమాలో బాలయ్య లుక్, అతని ఎనర్జీని పీక్ స్టేజ్ లో ఎంజాయ్ చేసిన నందమూరి అభిమానులు మళ్లీ బాలయ్య-పూరి కలయికలో సినిమా వస్తే బాగుండు అని కోరుకున్నారు. రీసెంట్ గా జరిగిన ఇస్మార్ట్ శంకర్ ప్రొమోషన్స్ సమయంలో పూరి జగన్నాథ్ కూడా బాలయ్య గురించి మాట్లాడుతూ హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమా చేసే ఏకైక హీరో బాలకృష్ణ మాత్రమే అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇక ఈ కాంబినేషన్ మళ్లీ ఎప్పుడు రిపీట్ అవుతుందా అని ఎదురు చుసిన అభిమానులని ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న ఒక వార్త ఖుషి చేస్తోంది. ప్రస్తుతం బాలయ్యకి ఉన్న కమిట్మెంట్స్ పూర్తి కాగానే అంటే బోయపాటి సినిమా అయిపోగానే పూరి జగన్నాథ్ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ లోపు పూరి కూడా విజయ్ దేవరకొండతో ప్లాన్ చేసిన ఫైటర్ ని కంప్లీట్ చేయనున్నాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందని తెలుస్తోంది. గతంలో బాలకృష్ణని తేడా సింగ్ కేరెక్టర్‌లో చూపించి నందమూరి అభిమానులని ఫిదా చేసిన పూరి, ఈసారి బాలయ్యని ఎలాంటి రోల్ లో చూపించబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.