మరోసారి బిగ్ బాస్ 4 హోస్ట్ విషయంలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. గత రెండు వారాల నుంచి హోస్ట్ నాగార్జున షోకి బ్రేక్ ఇవ్వనున్నాడు అంటూ కథనాలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఇక ఆయన స్థానంలో మరోసారి రమ్యకృష్ణ గెస్ట్ అప్పిరియన్స్ హోస్ట్ గా అలరించనున్నట్లు రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు జబర్దస్ట్ రోజా బిగ్ బాస్ 4 హోస్ట్ గా బాధ్యతలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు టాక్ నడుస్తోంది.
ఎమ్మెల్యే గానే కాకుండా మరోవైపు సినిమాలతో, రియాలిటీ షోలతో బిజీగా ఉంటున్న రోజా ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ గా కూడా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కథనాలు వైరల్ అవుతున్నాయి. అందుకు ఆమెకు భారీగా రెమ్యునరేషన్ కూడా ఇవ్వనున్నారట. ఇక నాగార్జున ఈ సీజన్ లో మళ్ళీ కనిపించకపోవచ్చు అనే రూమర్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే వైల్డ్ డాగ్ సినిమా కోసం భల్క్ డేట్స్ ఇచ్చేసిన మన్మథుడు దేశ సరిహద్దుల్లో షూటింగ్స్ ని పూర్తి చేయడానికి సిద్ధమయ్యాడు. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో మళ్ళీ షూటింగ్ చేసే అవకాశం ఉంటుందో ఉండదోనని ఇప్పుడే ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యారట. అందుకే ఆయన మళ్ళీ బిగ్ బాస్ వైవు చూసే అవకాశం లేదని టాక్ వస్తోంది. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.