గత కొన్నిరోజులుగా బిగ్ బాస్ 4కి సంబంధించిన అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే మొత్తనికి షోను ఈ నెల చివరలో స్టార్ట్ చేయబోతున్నారు. ఇక హోస్ట్ విషయంలో అనేక రకాల రూమర్స్ రాగా ఎట్టకేలకు నాగార్జున ఒక ట్వీట్ తో క్లారిటీ ఇచ్చేశారు. చాలా రోజుకు తరువాత మళ్ళీ లైట్స్, కెమెరా, యాక్షన్ అనే వేదికపైకి వచ్చాను అంటూ రెండు ఫోటోలను పోస్ట్ చేశారు..
అంతా బాగానే ఉంది కానీ నాగార్జునకు ప్రస్తుతం 60ఏళ్లు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో 50 ఏళ్ల కంటే పై బడిన వారు ఏ మాత్రం రిస్క్ చేయడం లేదు. అలాంటిది ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే నాగార్జున ఈ షోకి ఎలా ఒప్పుకున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. మెయిన్ గా షోలో హోస్ట్ గా చేస్తున్న నాగ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
ఒక విధంగా నాగ్ షేర్ చేసిన ఫొటోలను చూస్తుంటే.. మేకప్ వేసే అసిస్టెంట్స్ కె కాకుండా ఇతరులకు కూడా పూర్తిగా స్పెషల్ యాంటీ వైరస్ డ్రెస్ లను వేసినట్లు తెలుస్తోంది. ఏ మాత్రం ఛాన్స్ తీసుకోకుండా బిగ్ బాస్ యాజమాన్యం చాలా సీరియస్ గా నాగ్ కోసం ప్రత్యేక జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇలాంటి సమయంలో నాగ్ అంత నమ్మకంగా ఎలా ఒప్పుకున్నారు? ఆయనకు రెమ్యునరేషన్ ఏ స్థాయిలో ఇచ్చి ఉంటారు అనే సందేహాలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. మరి నాగ్ బిగ్ బాస్ 4తో ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.
Back on the floor with Lights, Camera, Action..what a wow…WOW!!! pic.twitter.com/tHg30ZgLl6
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 1, 2020