కొడుకుతో మొదటిసారి ఫోటోకి స్టిల్ ఇచ్చిన హార్దిక్ పాండ్య

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా రీసెంట్ గా గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. తన భార్య నటాషా స్టాంకోవిచ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని తాను తండ్రిని అయినట్లు ఈ ఆల్ రౌండర్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇవ్వగా ఆ ఫోటో మీడియాలో కూడా వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్స్ తో పాటు పలువురు స్టార్ క్రికెటర్లు హార్దిక పాండ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సెర్బియాకు చెందిన నటాషా స్టాంకోవిచ్ ని హార్దిక్ పాండ్య సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు చెప్పి గత ఏడాది అందరికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆమె ప్రెగ్నెన్సీ విషయం గురించి కూడా చెప్పి మరింత ఆస్కార్య పరిచిన ఈ క్రికెటర్ రీసెంట్ గా మరో ఫోటోను సోషక్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. తన కొడుకును ఎత్తుకొని దేవుని ఆశీర్వాదం అంటూ కామెంట్ చేశాడు. ఇక హార్దిక్ తన కొడుకుకు డైపర్ మార్చే డ్యూటీ ఎక్కాల్సిందే అంటూ నెటీజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో కూడా ఇంటర్నెట్ వరల్డ్ లో వైరల్ గా మారింది. ఇక నటాషా బాలీవుడ్ లో పలు సినిమాల్లో కూడా నటించింది. కొన్నాళ్ళు నటాషాతో డేటింగ్ లో ఉన్న తరువాత పాండ్య ఆమెను పెళ్లి చేసుకున్నట్లు తెలియజేశాడు.