Nagababu: కొండ‌చిలువ, నాగుపాముతో సంద‌డి చేస్తోన్న నాగ‌బాబు, నిహారిక క‌పుల్‌!

Nagababu: మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు భారీ కొండ చిలువ‌ను ప‌ట్టుకుని సంద‌డి చేశాడు. ఆయ‌న‌తో పాటు త‌న గారాల ప‌ట్టి నిహారిక‌, చైత‌న్య కొండ చిలువ‌ను ప‌ట్టుకుని ఫోటోలు దిగారు. దీంతో వీటికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వ‌న‌ప‌ర్తి జిల్లా సాగ‌ర్ స్నేక్ సొసైటీ అధ్య‌క్షుడు, హోంగార్డు సి. కృష్ణ‌సాగ‌ర్ అధ్వ‌ర్యంలో..

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం కృషి చేస్తున్న సేవ‌ల‌ను Nagababu నాగ‌బాబు గుర్తించారు. ఈ క్ర‌మంలో స్వ‌యంగా అత‌న్ని ఇంటికి పిలిపించుకుని కొండ చిలువ‌, నాగుపాముతో సంద‌డి చేశారు నాగ‌బాబు. ఈ నేప‌థ్యంలో నాగ‌బాబు త‌న మెడ‌లో కొండ చిలువ‌ను వేసుకున్నారు. Nagababuఆయ‌న‌తో పాటు నిహారిక‌, చైత‌న్య‌లు కూడా కొండ‌చిలువ‌ను ప‌ట్టుకుని సంద‌డి చేశారు. సోష‌ల్ మీడియాలో ఈ ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.