మా ఎన్నికల వివాదం గురించి చాలా మంది బాహాటంగానే మాట్లాడినా నందమూరి బాలకృష్ణ మాత్రం సైలెంట్ గా ఉంటూ వచ్చాడు. ఇప్పటి వరకూ సైలెంట్‌గా ఉన్న బాలయ్య, ఈ విషయంపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
మంచు విష్ణు మా కార్యాలయ భవనం నిర్మాణం చేపడతాను అంటే దానికి తన మద్దతు ఉంటుంది అని చెప్పిన బాలకృష్ణ, సినీ పెద్దలంతా కలిసి వస్తే ఇంద్రభవనం నిర్మించుకోవచ్చని చెప్పారు. కట్టబోయే దాని విషయం పక్కన పెట్టి అసలు ఇప్పటివరకూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవన నిర్మాణం ఎందుకు చేయలేదు అంటూ సూటిగా ప్రశ్నించాడు. ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్స్ వేసుకొని మరీ అమెరికా వెళ్లి అక్కడ ఈవెంట్స్ చేసిన వాళ్లు, ఆ ఫండ్స్ ని ఏం చేశారు అంటూ క్వేషన్ చేశాడు. ఇంతే కాకుండా కొంతమంది సినిమా వాళ్లు తెలంగాణ ప్రభుత్వంతో రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు కదా, మా భవనం కోసం అడిగితే ప్రభుత్వం ఒక ఎకరం ఇవ్వదా? అని ఆయన ప్రశ్నలు సందించాడు. ఇక మా ఎన్నికల విషయంలో లోకల్, నాన్ లోకల్ అనే విషయాన్ని పట్టించుకోనని చెప్పారు. గ్లామర్ ఇండిస్టీలో ఉన్న మనమంతా బహిరంగంగా చర్చించుకోవడం సరికాదన్నారు. అసోసియేషన్ ఎన్నికల్లో అర్టిస్టులు అందరూ సమానమేనన్నారు బాలకృష్ణ చెప్పారు.
ఈ విషయంపై మాట్లాడడానికి ముందుకి వచ్చిన మెగా బ్రదర్ నాగబాబు, బాలయ్య బాబు చేసిన కామెంట్ లపై రియాక్ట్ అయ్యారు. “మా” అసోసియేషన్ కి అధ్యక్షుడిగా అప్పట్లో వ్యవహరించిన మురళీమోహన్ పోరాటం చేసి ఉంటే ఎప్పుడో శాశ్వత భవనం వచ్చేదని తన అభిప్రాయాన్ని తెలిపారు.
అంతమాత్రమే కాకుండా ఇప్పటివరకు అధ్యక్షులు గా వ్యవహరించిన చాలా మంది భవనం విషయంలో నిర్లక్ష్యం వహించారని.. మరి ఇప్పుడు మంచు విష్ణు వచ్చి శాశ్వత భవనం నిర్మిస్తామని అంటున్నారు అసలు ఆయనకు స్థలం పై ఎటువంటి స్పష్టత ఉందని నాగబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక ఇదిలా ఉంటే అన్ని విషయాల్లో క్లారిటీ ప్రకాష్ రాజ్ కి ఉంది కాబట్టే తాము మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏకగ్రీవం అనేది తాము ఆమోదించమని ఆరోగ్యకరమైన పోటీ అభ్యర్థుల మధ్య ఉండాలని, ఎకగ్రీవమే కావాలంటే పోటీ నుంచి అందరూ తప్పుకుంటే ప్రకాష్ రాజ్ ఏకగ్రీవంగానే గెలుస్తాడు కదా అంటూ కామెంట్స్ చేశాడు. ఒకపక్క ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి కూర్చొని, మాట్లాడి ఈసారి ఎన్నికల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటుంటే నాగబాబు మాత్రం ఇలా కామెంట్స్ చేయడం వెనక ఆంతర్యం ఏంటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అన్నట్లు నాగబాబు కూడా మా అసోసియేషన్ లో కీలక పదవులు చేపట్టాడు. మరి ఆయన హయంలో కూడా భవనం ఎందుకు పూర్తవ్వలేదో ఆయనే చెప్తే బాగుంటుందని నెటిజెన్స్ విమర్శలు చేస్తున్నారు. సానుకూలంగా మాట్లాడి పరిష్కరించుకోవాల్సిన సమస్యని కొందరు పెద్దవి చేస్తున్నారేమో అని అభిప్రాయం కొందరిలో ఉంది. ఇదిలా ఉంటే గతంలో నాగబాబు ఇంటన్షనల్ గానే విమర్శలు చేసిన విషయాన్ని నందమూరి అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.