Mega Brother: సిగ‌రెట్ నోట్లో పెట్టుకుని మాస్ లుక్‌లో నాగ‌బాబును చూశారా..

Mega Brother: మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు అంటే ప్రేక్ష‌కుల్లో మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడు.. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ అన్న‌య్య అని త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త ఉంటుంది. చిరు, ప‌వ‌న్ హీరోలుగా సినీ ఇండ‌స్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఇక నాగ‌బాబు ప‌లు చిత్రాల్లో హీరోగా చేసిన అంత‌లా ఆక‌ట్టుకోలేక‌పోయాడు. కానీ బుల్లితెర మీద‌ Mega Brother నాగ‌బాబు ఓ రేంజ్‌లో హ‌ల్చ‌ల్ చేస్తున్నారు. బుల్లితెర ప్రొగ్రాంల‌కు కొత్త కొత్త క‌మెడియ‌న్ల‌ను ప‌రిచ‌యం చేస్తూ.. వారిని ప్రొత్సాహించ‌డంలో ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు నాగ‌బాబు. నాగ‌బాబు గ‌తంలో జ‌బ‌ర్ద‌స్త్ ప్రొగ్రాంలో జ‌డ్జిగా చేసిన విష‌యం తెలిసిందే. కానీ ప‌లు కార‌ణాల వ‌ల్ల ఆ షోకు గుడ్ బై చెప్పాడు Mega Brother నాగ‌బాబు. అనంత‌రం అదిరింది ప్రొగ్రాంతో ముందుకు వ‌చ్చి మంచి టీఆర్‌పీ రేటింగ్‌ను సంపాదించుకుంది.

nagababu latest

అలాగే ఆయ‌న మ‌న ఛాన‌ల్ మ‌న ఇష్టం అనే యూట్యూబ్ ఛానెల్‌లో త‌న అభిప్రాయాల‌ను నిర్భ‌యంగా వెల్ల‌డిస్తూ వ‌స్తున్నారు. కాగా తాజాగా నాగ‌బాబు సోష‌ల్ మీడియాలో ఒక సరికొత్త లుక్‌లో క‌నిపించాడు.. అంతా షాక్ .. షాక్ గురవాల్సినంతగా ఆ లుక్‌లో ఏముంద‌బ్బా అనుకుంటున్నారా?.. నాగ‌బాబు నోట్లో సిగ‌రెట్ పెట్టుకుని.. ముఖంపై క‌త్తి గాటు.. కొర‌మీసంతో మాస్ లుక్‌లో ఓ రేంజ్‌లో కేక పుట్టిస్తున్నాడు. ఈ ఫోటోకు.. మ‌నిషి రూత్ అనేది త‌న వేష‌ధార‌ణ‌లో క‌నిపించ‌దు. యాంగ‌ర్ అంటే నేను ఎలా ఉన్నానో అని కాదు.. నేను ఎలా స్పందిస్తాను అని అంటూ కామెంట్‌తో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు Mega Brother నాగ‌బాబు.. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో హల్‌చ‌ల్ చేస్తోంది.‌