Nagababu: మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న మరో హీరో పంజా వైష్ణవ్‌తేజ్. వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వైష్ణవ్‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. అలాగే ఈ చిత్రంలో విలన్‌పాత్రల్లో మక్కల్ సెల్వన్ విజయ్‌సేతుపతి నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని సుకుమార్ దగ్గర పనిచేసిన అసోసియేట్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని వాలంటైన్స్‌డే సందర్బంగా ఫిబ్రవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిత్రబృందం. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి మాత్రమే వచ్చారు. మెగా ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ రాలేదు. దీంతో ఈవిషయంపై క్లారిటీ ఇచ్చాడు మెగాబ్రదర్ నాగబాబుNagababu.
చదువుకుంటావా? లేక సినిమాల్లో నటిస్తావా? అని నేను చాలా సార్లు అడిగాను. కానీ అతని దగ్గరి నుంచి ఏది ఖచ్చితంగా చెప్పలేకపోయాడు. ఓ సారి సినిమాల్లో చేస్తావా అంటూ వైష్ణవ్‌ను సీరియస్‌గా అడిగాను.. కానీ అప్పటికీ కూడా సమాధానం చెప్పలేకపోయాడు. అయితే ఉప్పెన సినిమాల్లో నటిస్తున్న అని తనతో చెప్పగానే నేను ఎంతో హ్యాపీగా ఫీలయ్యానుNagababu. వైష్ణవ్‌లో మంచి తనం ఎక్కువగానే ఉంటుంది.. మాకున్న మెగా ఇమేజ్ పరంగా ఒకరకంగా ప్లస్ అయితే, అతని పర్ఫార్మెన్స్ విషయంలో రీచ్ కాకపోతే అదే మైనస్ అవుతుంది. మా అన్నయ్య చిరంజీవి గారు, అలాగే మా తమ్ముడు కళ్యాణ్ బాబు కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేశారు. ఆ స్టాండర్డ్స్ రీచ్ కావాలంటే వరుణ్ గానీ, వైష్ణవ్ గానీ చాలా కష్టపడాలి. వైష్ణవ్ సినిమాల్లోకి వచ్చే ముందు థాయ్ బాక్సింగ్ నేర్చుకొని రా అంటూ కళ్యాణ్‌బాబు సూచించినట్టు తెలిపాడు Nagababu నాగబాబు. అయితే మొన్న జరిగిన ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు రాకపోవడానికి కారణం.. నేను గానీ, మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు అటెండ్ కాలేదు. కానీ మా అందరికీ పెద్ద దిక్కు కాబట్టి మా అన్నయ్యను పిలిచారు. ఆ రకంగా వైష్ణవ్‌తేజ్‌కు ఆయన ఆశీస్సులు దక్కాయి.. అలాగే కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయండి అని అన్నారు. ఇక వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటూ.. దీంట్లో నటించిన నటీనటులకు మంచి పేరు రావాలని, డైరెక్టర్ బుచ్చిబాబుకు మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను అని Nagababuనాగబాబు పేర్కొన్నారు.