అక్కినేని నాగచైతన్య-శోభిత రెండు రోజుల క్రితం వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే దగ్గుబాటి ఫ్యామిలీ చైతూను పెళ్లికొడుకును చేసిన ఫొటోలను తాజాగా విడుదల చేసింది. చైతూ తన తల్లి లక్ష్మీతో కలిసి దిగిన ఫొటోలు కూడా ఉన్నాయి. నాగార్జునకు, మొదటి భార్య లక్ష్మీకి జన్మించిన కుమారుడే నాగచైతన్య. నిర్మాత డి. రామానాయుడు కూతురే లక్ష్మీ. ఆమె సోదరులు వెంకటేశ్, సురేశ్ బాబు.. చైతూకు మేనమామలు అవుతారు.