Tollywood: అల్లరి నరేశ్ నటించిన తాజా చిత్రం నాంది. ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. గతంలో నరేశ్ నటించిన గమ్యం, శంభో శివ శంభో, మహర్షి సినిమాల్లో నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా రోజుల తర్వాత అలాంటి వైవిధ్యమైన పాత్రల్లో నాంది సినిమాను చేశాడు Tollywoodనరేశ్. మరీ ఈ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో నరేశ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి, మధ్య తరగతి కుర్రాడు. తల్లితండ్రులు ఎంతో ప్రేమగా ప్రేమించబడే కొడుకుగా.. అలాగే స్నేహితుడితో కలిసి హాయిగా జీవితం సాగిస్తుంటాడు. మీనాక్షీ నవమి అనే పాత్ర అమ్మాయితో పెళ్లి కూడా నిశ్చమయమవుతుంది. ఇంతలో న్యాయవాది, మానవ హక్కుల కోసం పోరాడే సామాజిక ఉద్యమకారుడు రాజగోపాల్‌ని హత్య చేశాడనే ఆరోపణల్లో సూర్యప్రకాశ్ (నరేశ్) పోలీసులు అరెస్ట్ చేస్తారు. దీంతో ఆ హత్య కేసులో 5ఏళ్లు జైల్లోనే గడుపుతాడు.
ఇంతకీ ఆ హత్యని సూర్యప్రకాశ్ చేశాడా? ఐదేళ్ల తర్వాత అతని జీవితంలో ఏం జరిగింది తదితర విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక Tollywoodఈ సినిమాలో నరేశ్ తన నటనతో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్నాడు. ఆయన కామెడీ ఇమేజ్ గానీ, గత Tollywoodచిత్రాల ప్రభావం గానీ ఈ పాత్రపై ఏ మాత్రం చూపించలేదు. అంతలా ఈ పాత్రలో నరేశ్ ఒదిగిపోయాడు. ఇక నరేశ్ జైల్లో మగ్గుతున్నప్పుడు ఆయన ప్రదర్శించిన హావభావాలు, ఆ క్రమంలో పండే భావోద్వేగాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. అలాగే ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్ లాయర్ పాత్రను పోషించి తనదైన మార్క్‌ను మరోసారి నిరూపించింది. వరలక్ష్మీ ప్రేక్షకుల మనస్సులో మరింత గుర్తింపు సంపాదించుకుంది. ఈ Tollywoodచిత్రం సెకండాఫ్‌లో వచ్చే సన్నీవేశాల్లో వరలక్ష్మీ శరత్‌కుమార్ నటన అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ చిత్రంలో కమెడియన్స్ ప్రియదర్శి, ప్రవీన్ అక్కడక్కడా నవ్విస్తూ పాత్రల్లో ఒదిగిపోయారు. హరీశ్ ఉత్తమన్, వినయ్ వర్మ విలన్స్‌గా మెప్పించారు. శ్రీకాంత్ అయ్యంగార్, దేవిప్రసాద్, హీరోయిన్ నవమి తదితరులు వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక సాంకేతికంగా విషయానికొస్తే.. అబ్బూరి రవి మాటలు ఈ చిత్రంలో అద్భుతం. ఈTollywood చిత్రానికి సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల, సిధ్ కెమెరా పనితనం, కళ ప్రతిభ మెప్పిస్తాయి. ఇక దర్శకుడు విజయ్ కనకమేడల ప్రతిభ అద్భుతం. మొత్తానికి ఈ చిత్రానికి నిర్మాణ విలువలు ఉన్నతంగా కనిపిస్తాయి. ఇక మొత్తానికి నాంది సినిమా పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది.