ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్, కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ తో వారి అప్ కమింగ్ మల్టీ లింగ్వెల్ వెంచర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ హైప్రొఫైల్ ప్రాజెక్ట్ ఇప్పటికే పోస్టర్‌లతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మైత్రీ మూవీ మేకర్స్ తమిళ చిత్రసీమలోకి ప్రవేశిస్తున్నందున, ఈ స్టార్-స్టడెడ్ ప్రాజెక్ట్ కోసం అంచనాలు భారీగా ఉన్నాయి, ఇది గ్రిప్పింగ్ యాక్షన్, ఆకట్టుకునే డ్రామా బ్లెండ్ గా వుంటుంది. అజిత్ ని క్రేజీ అవతార్‌లో చూడటానికి అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఈ రోజు, మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 10, 2025న విడుదలవుతున్న ఈ చిత్రం వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా నిలిచింది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో, అజిత్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అదరగొట్టారు. చేతిలో తుపాకీతో సోఫాలో కూర్చున్న అతను, ఇంటెన్సిటీ , సస్పెన్స్‌తో కూడిన పెర్ఫార్మెన్స్ అందిస్తానని హామీ ఇచ్చారు.
మార్క్ ఆంటోని విజయం తర్వాత, స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌లను రూపొందించడంలో నైపుణ్యం కలిగిన దర్శకుడు అధిక్ రవిచంద్రన్, అజిత్ కుమార్‌ను మల్టీ -లేయర్డ్ పాత్రలో చూపించబోతున్నారు.
ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ ఫీమేల్ లీడ్ గా నటిస్తున్నారు.ప్రభు, ప్రసన్న, అర్జున్ దాస్ సునీల్ కీలక పాత్రలు పోహిస్తున్నారు.
నవీన్ యెర్నేని, వై రవి శంకర్ హై బజేట్ తోనిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ భారతీయ చలనచిత్రంలో ఒక మైలురాయి చిత్రంగా నిలుస్తుందని హామీ ఇచ్చింది,
ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సౌండ్‌ట్రాక్ అందించగా, అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఎడిటింగ్‌ను విజయ్ వేలుకుట్టి నిర్వహిస్తుండగా, ప్రొడక్షన్ డిజైన్‌ను జి ఎం శేఖర్ పర్యవేక్షిస్తున్నారు.
మేకర్స్ విడుదల తేదీని ప్రకటించినందున, త్వరలో ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తారు.
తారాగణం: అజిత్ కుమార్, త్రిష కృష్ణన్, ప్రభు, ప్రసన్న, అర్జున్ దాస్, సునీల్
సాంకేతిక సిబ్బంది
రచన, దర్శకత్వం: అధిక్ రవిచంద్రన్
DOP: అభినందన్ రామానుజం
సంగీతం : జివి ప్రకాష్ కుమార్
ఎడిటర్: విజయ్ వేలుకుట్టి
ప్రొడక్షన్ డిజైనర్: జి ఎం శేఖర్
స్టంట్స్: సుప్రీం సుందర్, కలోయన్ వోడెనిచరోవ్
స్టైలిస్ట్: అను వర్ధన్ / రాజేష్ కమర్సు
పీఆర్వో: సురేష్ చంద్ర
పీఆర్వో (తెలుగు) : వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
మార్కెటింగ్ (తమిళం) : డి’వన్
సౌండ్ డిజైన్: సురేన్
స్టిల్స్ : జి ఆనంద్ కుమార్
పబ్లిసిటీ డిజైన్: ADFX స్టూడియో
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేష్ నరసింహన్
సిఈవో: చెర్రీ
నిర్మాతలు: నవీన్ యెర్నేని-వై రవిశంకర్