నన్ను మూడు తరాలుగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు : ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమల్ హాసన్

తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఇప్పటికి ఎన్నో సినిమాలు వచ్చాయి. తమిళనాడులో సుమారు అందరూ అగ్ర హీరోలతో అయినా దర్శకత్వం చేశారు. వాటిలో చాలా సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించినవి ఉన్నాయి. అయితే 1996లో ఆయన దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా నిలిచిపోయింది. కమలహాసన్ సేనాపతిగా డ్యూయల్ రోల్స్ లో నటిస్తూ వచ్చిన ఆ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అయితే ఇప్పుడు సుమారు 27 సంవత్సరాల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ వస్తుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జె సూర్య, బాబి సింహ తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు. అనిరుద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జైంట్ మూవీస్ వారు జంటగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే భారతీయుడు 2 సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్స్ లో జులై 7 ఆదివారం ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం జరిగింది. ఈవెంట్ విజయం చేయడానికిగాను ఈ సినిమా టీ మొత్తం హాజరు కావడం జరిగింది.

భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన హాస్య నట బ్రహ్మానందం గారు మాట్లాడుతూ… “నేను నా కాలేజీ రోజుల నుండి కమలహాసన్ గారిని చూస్తున్నాను. నేను వారి కూతురు శృతిహాసన్ గారితో నటించాను అలాగే ఈ సినిమాలో నటించిన సిద్ధార్థ గారితో ప్రకృతి గారితో అలాగే చాలా మంది నటించాను. కానీ కమలహాసన్ గారితో నటించడం అనేది ఒక పెద్ద నిజంగా నేను చూస్తున్నాను. కమల్ హాసన్ గారు నటిస్తుంటే ఆయన శరీరంలోని ప్రతి ఒక్క అవయవం నటిస్తుంది. అటువంటి నటుడు దక్షిణభారతం లేదా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరు ఉండరని నేను గర్వంగా చెప్పుకుంటాను. అలాగే యునైటెడ్ దగ్గర నుండి ఎంత నటన రాబట్టాలి ఎలా నటించేలా చేయాలి అనే విషయం బాగా తెలిసిన దర్శకుడు శంకర్ గారు” అన్నారు. అలాగే స్టేజ్ మీద కమల్ హాసన్ గారి వాయిస్ ని మిమిక్రీ చేస్తూ కమల్ హాసన్ గారు వేదికపై మాట్లాడితే ఇలా ఉంటుందో చేసి చూపించారు బ్రహ్మానందం గారు.

రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ… “చాలా రోజుల తర్వాత హైదరాబాద్కు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన శంకర్ గారికి అలాగే కమలహాసన్ గారికి నా కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాలో పనిచేసిన సిద్ధార్థ్, బాబి సింహ, ఎస్ జె సూర్య తదితరులకు నా కృతజ్ఞతలు. అలాగే అందరూ భారతీయుడు సినిమా చూసి గొప్ప విజయం సాధించేలా చూడాలని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరో సిద్ధార్థ్ తన బాయ్స్ సినిమాలోని పాటతో తన స్పీచ్ మొదలుపెట్టారు. ఆయన మాట్లాడుతూ… “నన్ను చిన్నప్పటినుండి ఎవరైనా నీకు ఇష్టమైన నటుడు ఎవరైనా అడిగితే నేను కమల్ హాసన్ గారు అని చెప్తాను. అటువంటి కమల్ హాసన్ గారి చిత్రంలో నటించిన నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు శంకర్ గారికి నేను ఎంతగానో రుణపడి ఉంటాను. అలాగే ఈ సినిమాలో నాతోపాటు నటించినా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాను నేటి తరం వాడు అందరూ కచ్చితంగా చూడాలి” అన్నారు.

ఎస్ జె సూర్య మాట్లాడుతూ… ” కమలహాసన్ గారితో నటించిన చాలా గర్వంగా ఉంది. అలాగే శంకర్ గారి దర్శకత్వంలో పనిచేయడం తనకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను శంకర్ గారు దసరా వస్తున్న భారతీయుడు2, గేమ్ చేంజర్, భారతీయుడు3 సినిమాలో నటిస్తున్నాను. ఒక దర్శకుడు ఒకేసారి మూడు భారీ చిత్రాలు చేయడం అనేది మామూలు విషయం కాదు. కానీ శంకర్ గారు చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో నా స్నేహితుడు సిద్ధార్థ్ తో కలిసి నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. విచిత్రంగా నటించిన బాబి సింహ, రకుల్ ప్రీత్ సింగ్, సముద్రఖని గారితో పనిచేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన స్నేహితుడైనందుకు తను చాలా గర్విస్తున్నాను. నేను ఒక రోజు చెప్పాను ఒక రోజు నా స్నేహితుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు అని. ఇప్పటికి నా కోరిక సగం నెరవేరింది. ఇంకా సగం త్వరలోనే నెరవేరాలని ఉంది. ” అన్నారు.

చిత్ర దర్శకుడు శంకర్ మాట్లాడుతూ… “ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరు చాలా శ్రద్ధతో పని చేశారు. ఒక టేక్ లో కాకపోతే మరో టేక్ లో లేదు అది కూడా నచ్చకపోతే ఇంకొకటి చేద్దాం అంటూ వారే నన్ను ఎప్పటికప్పుడు ఉత్సాహపరుస్తూ వచ్చారు. అలాగే సినిమాలో నటించిన బాబి సింహ, సముద్రఖని రూల్స్ చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. అలాగే చిత్రం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క టెక్నీషియన్ కు పేరుపేరునా నా ధన్యవాదాలు. ఈవెంట్లో తమ డాన్సులతో పెర్ఫార్మన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గారు మాట్లాడుతూ… “నేను 52 సంవత్సరాల క్రితం మొదటిసారిగా ఒక టెక్నీషియన్ గా హైదరాబాద్ వచ్చాను. అప్పటినుండి ఇప్పటివరకు నన్ను ఆదరిస్తూ, అభిమానులు వస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. నేను ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడాలి అనుకుంటున్నాను అది అంతా నా వాయిస్ లో ఇప్పటికే బ్రహ్మానందం గారు మాట్లాడారు. మూడు తరాలుగా నన్ను నడిపిస్తూ ఇంతటి వాడిని చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నా సినిమాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినందుకు శంకర్ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాలో నటించిన సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జె సూర్య, బాబీ సింహా, సముద్రఖని గారికి ధన్యవాదాలు. ఈ సినిమా ప్రతి ఒక్కరిది. ప్రతి ఒక్కరి జీవితం ఈ సినిమాలో చూసుకోవచ్చు. ఈ సినిమా కథ మీతో మాట్లాడుతుంది. ఇటువంటి సినిమాలు భారత చలనచిత్రం గానికి గర్వకారణం. సముద్ర కని గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అప్పటి భారతీయుడు సినిమాలో ఎక్కడో ఒకచోట అనిపిస్తే చాలు అనుకున్నారు కానీ ఇప్పుడు భారతీయుడు 2 లో 28 సంవత్సరాల తర్వాత ఆయనకంటూ ఒక ప్రత్యేక పాత్ర లో నటించారు. అది చాలా పెద్ద నిజంగా అనుకోవచ్చు. అలాగే సురేష్ గారి ద్వారా ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు. అలాగే ఇక్కడ పర్ఫామెన్స్ లు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు” అన్నారు.