Powerstar: వ‌కీల్‌సాబ్ సిగ‌రెట్లు వెలిగించే చిత్రం కాదు.. దీపాలు వెలిగించే చిత్రం: మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌‌మ‌న్

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న వ‌కీల్ సాబ్ చిత్ర ప్రీరిలీజ్ వేడుక‌లు నిన్న రాత్రి ఘ‌నంగా నిర్వ‌హించారు. హైద‌రాబాద్‌లోని శిల్పాక‌ళా ఆడిటోరియం వేదికైంది. ఈ కార్య‌క్ర‌మానికి చిత్ర‌బృందంతో పాటు ప‌లువురు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హజ‌రై చిత్ర‌బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా ఈ క్ర‌మంలో ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌. థ‌మ‌న్ మాట్లాడుతూ.. ప‌వ‌న్ సినిమా కోసం నేను ప‌డినా త‌ప‌న అంతా ఇంతా కాదు.. ఆయ‌నకు మాస్ బాణీలు క‌ట్టాల‌ని అనుకున్నాను కానీ ఇలాంటి క‌థ రావ‌డంతో నా మెద‌డుకు ప‌దును ఎక్కువ‌గా పెట్టాను. ఎందుకంటే క‌మ‌ర్షియ‌ల్ సాంగ్స్‌, ఐటెం సాంగ్స్ వంటి ఒక్క‌రోజులోనే పూర్తి చేయొచ్చు..

ఇది సందేశాత్మ‌క‌మైన చిత్రం కాబ‌ట్టి ఎంతో క‌ష్ట‌ప‌డ్డాను. కొన్ని రోజుల‌పాటు నేను నా టీమ్ స‌రిగ్గా నిద్ర పోకుండా ప‌నిచేసాం. ఆ క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం మ‌గువా మ‌గువా, స‌త్య‌మేవ జ‌య‌తే, క‌దులు క‌దులు సాంగ్స్‌.. కొంద‌రు ఐటెం సాంగ్స్ ఉండ‌వా అని అడుగుతున్నారు. నేను ఒక్క‌టే చెబుతున్నా.. ఈ చిత్రం సిగ‌రెట్స్ వెలిగించుకునేది కాదు.. ఇంట్లో దీపాలు వెలిగించే సినిమా అని త‌మ‌న్ చెప్ప‌గానే ఆడిటోరియం మొత్తం ద‌ద్ధ‌రిల్లిపోయింది.‌