Tollywood: అఖిల్ అక్కినేని- పూజా హెగ్దే ల సినిమా నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్..

Tollywood: అఖిల్ అక్కినేని, పూజా హెగ్దే హీరోహీరోయిన్ల్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌. ఈ చిత్రానికి బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో.. అల్లుఅర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న చిత్రానికి గోపీ సుంద‌ర్ స్వ‌రాలు అందిస్తుండ‌గా.. ఆయ‌న స్వ‌ర‌పరిచిన మ‌న‌సా మ‌న‌సా, గుచ్చే గులాబీ పాట‌ను ఫ్యాన్స్‌ను ఎంతో విశేషంగా ఆక‌ట్టుకున్నాయి.

Akil poojahegde

కాగా తాజాగా ఏ జింద‌గీ అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఆకాశ‌మంతా ఆనంద‌మై.. తెల్లారుతోందే నాకోస‌మై.. ఆలోచ‌నంతా ఆరాట‌మై అన్వేషిస్తోందో ఈ రోజుకై అంటూ సాగే పాట‌ను రామ జోగ‌య్య‌శాస్ట్రి లిరిక్స్ అందించ‌గా.. హానియా న‌ఫీసా అనే కొత్త గాయ‌నీ ఈ సాంగ్‌ను ఆల‌పించింది. ప్ర‌స్తుతం ఈ సాంగ్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఈ చిత్రం జూన్ 19న థియేట‌ర్ల‌లోకి రానుంది.‌