‘మహేష్ బాబు’, ‘త్రివిక్రమ్’ ఒప్పుకుంటే ‘అతడు 2’ రేపే స్టార్ట్ చేస్తా!!

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వీరి కలయికలో వచ్చిన అతడు సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత వచ్చిన ఖలేజా డిజాస్టర్ అయినప్పటికీ టీవీలలో ఆ సినిమా మంచి రేటింగ్ అందుకుంటుంది. అలాగే అతడు కూడా టీవీలలో ఎన్నో టిఆర్పీ రికార్డులు అందుకుంది.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. అతడు సినిమాను నిర్మించిన సీనియర్ నటుడు మురళి మోహన్ ఇటీవల ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. త్రివిక్రమ్, మహేష్ రెడీ అంటే రేపే అతడు 2 సినిమాను స్టార్ట్ చేయడానికి నేను సిద్ధమేనని అన్నారు. ఒక్కసారిగా ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలైతే మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రానుందని గత కొన్ని రోజులుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ ఆ విషయంలో ఇంతవరకు అఫీషియల్ గా ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. మరి మురళీమోహన్ మాటలకైనా వారు స్పందిస్తారో లేదో చూడాలి.