
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసును ముంబై పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితో పాటు.. పలువురు బాలీవుడ్ ప్రముఖుల్ని సైతం విచారించారు. సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్య చోప్రాలని కూడా విచారించారు. తాజాగా సుశాంత్ కేసులో ప్రముఖ హీరోయిన్ కంగనాని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు.
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి 40 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ ఈయన గురించి చర్చ మాత్రం జరుగుతూనే ఉంది. కొందరు దీన్ని హత్య అంటున్నారు.. మరికొందరు మాత్రం ఆత్మహత్య చేసుకున్నాడని నమ్ముతున్నారు. మరోవైపు ఈ కేసును ముంబై పోలీసులు కూడా అంత ఈజీగా వదిలేయడం లేదు. బాలీవుడ్లో ఉన్న నెపోటిజమ్ కారణంగానే ఈయన చనిపోయాడని కంగన సహా చాలా మంది మీడియా ముందే నోరు విప్పారు. ఈ క్రమంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ను ముంబై పోలీసులు ప్రశ్నించనున్నారు.