తెలుగులో మరో భారీ మల్టీస్టారర్‌ సినిమా?

తెలుగులో మల్టీస్టారర్ సినిమాలకు కొదవే లేదు. పాతతరం హీరోలే కాకుండా ఈ తరం హీరోలలో కూడా ప్రతిఒక్క హీరో మల్టీస్టారర్ సినిమాలకు ఒకే చెబుతున్నారు. ప్రస్తుత జనరేషన్‌లో ఇప్పటికే చాలామంది హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేశారు. పవన్ కల్యాణ్, వెంకటేష్, మహేష్ బాబు, శ్రీకాంత్ లాంటి హీరోలు ఇప్పటికే మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRRలో రాంచరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.

PAWAN AND MAHESH

తాజాగా తెలుగులో మరో మల్టీస్టారర్ సినిమాకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాంబోలో మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనుందట. ఒక ప్రముఖ నిర్మాత ఈ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దర్శకుడు ఎవరనేది ఇంకా కన్ఫామ్ కాలేదట. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు బయటపడే అవకాశముంది.

పవన్, మహేష్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. దీంతో వీరిద్దరు కూడా కలిసి నటించేందుకు ఒకే చెప్పినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరిద్దరికి మల్టీస్టారర్ సినిమాల్లో నటించిన అనుభవం ఉంది. గతంలో వెంకటేష్‌తో కలిసి ‘గోపాల గోపాల’ సినిమాలో పవన్ నటించాడు. ఇక ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో వెంకటేష్‌తో కలిసి మహేష్ బాబు నటించాడు. టాలీవుడ్‌లో పవన్, మహేష్ బాబుకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక వీరికి పెద్ద సంఖ్యలో అభిమానులు కూడా ఉన్నారు. దీంతో వీరిద్దరు కలిసి నటిస్తే.. అది ప్రేక్షకులకు పెద్ద పండుగే అని చెప్పవచ్చు.