గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో కూతురు

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. మలయాళంలోనే కాకుండా తమిళం, తెలుగు భాషల్లో కూడా ఆయన పలు సినిమాల్లో నటించారు. ఇప్పుడు ఆయన పేరు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే.. దానికి కారణం ఆయన కూతురినే. మోహన్ లాల్ కూతురు విస్మయ ఏకంగా 22 కేజీల బరువు తగ్గింది. ఇంతకుముందు చాలా లావుగా, బొద్దుగా ఉండే ఆమె.. ఇప్పుడు స్లిమ్‌గా తయారైంది. ఇప్పుడు ఆమెను చూసినవారు ఆశ్చర్యపోతున్నారు.

MOHANLAL DAUGHTER

మరికొంతమంది అయితే స్లిమ్‌గా ఉన్న ఆమెను చూసి గుర్తుపట్టలేకపోతున్నారు. బరువు తగ్గడానికి వ్యామాయాలు చేయడం, మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకోవడం లాంటివి చేశానని విస్మయ చెబుతోంది. ఇంతకుముందు బరువుతో ఉన్న ఫొటోతో పాటు ఇప్పుడు సన్నగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో విస్మయ విడుదల చేసింది. దీంతో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్న ఫొటోలను కూడా రిలీజ్ చేసింది.

ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం విస్మయ థాయ్‌లాండ్‌లో ఉంటుంది. కొన్నేళ్ల క్రితం తాను నాలుగు మెట్లు ఎక్కుతుంటేనే ఊపిరాడక ఇబ్బంది పడ్డానని, అప్పుడు బరువు తగ్గాలనే ఆలోచన వచ్చిందని చెబుతోంది. ఇప్పుడు బరువు తగ్గినందుకు చాలా ఆనందంగా ఉందని, నా కోచ్ వల్లే ఇది సాధ్యమైందని చెబుతోంది.