Pan India Movie: ఇండియన్ ఫస్ట్ మడ్ రేసింగ్ ఫిల్మ్ గా భారీ బడ్జెట్ తో తెలుగు, కన్నడ, హిందీ, తమిళ మరియు మలయాళం మొత్తం 5 భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న సినిమా ‘మడ్డీ’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మోషన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుని సినిమా మీద ఆసక్తి రేకెత్తించింది. ఇప్పటికే 3 మిలియన్ వ్యూస్ పైగా సాధించి ట్రెండ్ అవుతోంది. Pan India Movie’మడ్డీ’ చిత్ర టీజర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫిబ్రవరి 26న సాయంత్రం 6:03 కి విడుదల చేయనున్నారు.
Pan India Movie’మడ్డీ’ చిత్రంతో డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. యువన్, రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పీకే7 క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ కృష్ణదాస్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రియల్ లొకేషన్స్ లో, రియల్ మడ్ రేసింగ్ ప్లేయర్స్ తో ఎంతో రియలిస్టిక్ గా, లావిష్ గా Pan India Movieఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కె జీ ఎఫ్ ఫేం రవి బస్రుర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేశారు. మోషన్ పోస్టర్ విడుదల తర్వాత ప్రేక్షకులు మడ్డీ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మేకర్స్ ఈ Pan India Movieచిత్ర ప్రమోషన్స్ ను దేశవ్యాప్తంగా భారీగా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీ ని ప్రకటించనున్నారు.