Bollywood: ఆ విష‌యంలో శ్రీ‌దేవీ త‌ర్వాత నేనే: క‌ంగ‌నార‌నౌత్

Bollywood:బాలీవుడ్ లేడీ ఫైర్ బ్రాండ్ కంగ‌నార‌నౌత్‌ న‌టించిన త‌ను వెడ్స్ మ‌ను చిత్రం నేటితో ప‌దేళ్ల అవుతుంది. ఈ సంద‌ర్భంగా ఆమె తాజాగా ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించింది. త‌ను వెడ్స్ మ‌ను చిత్రానికి ముందు తాను ఎన్నో విభిన్న‌మైన చిత్రాల్లో న‌టించాను. కానీ ఈ సినిమా మాత్రం నా జీవితాన్నే మ‌రొక విధంగా మార్చేసింది.

Kangana ranut

Bollywoodఇందులో డిఫ‌రెంట్ క‌థాంశంతో పాటు నా న‌ట‌న‌తో సినీ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఫిదా చేశాను. నా కామెడీ టైమింగ్ కూడా ఇందులో ఎంతో బాగా అల‌రించింది. ఇంకా చెప్పాలంటే లెజండ‌రీ న‌టి శ్రీ‌దేవి త‌ర్వాత అంత‌లా కామెడీ చేయ‌గ‌లిగింది నేనే అంటూ కంగ‌నా ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక Bollywoodకంగ‌నా ప్ర‌స్తుతం న‌టించిన తాజా చిత్రం త‌లైవి విడుద‌ల‌కు సిద్ధంగా వుంది.. ఈ చిత్రంలో దివంగ‌త జ‌య‌ల‌లిత పాత్ర‌లో కంగ‌నా న‌టిస్తోంది.