Tollywood: హైదరాబాద్‌లోని బేగంపేట ప్రాంతంలో గతంలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన నాని పోస్టర్ చూస్తూ ప్రమాదకరమైన యాక్సిడెంట్స్ జరిగాయి.. ఆ పోస్టర్లో హీరోహీరోయిన్ల్ లిప్‌లాక్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. దీంతో కొందరు ఆ పోస్టర్‌ను చూస్తూ బండ్లను నడుపుతూ యాక్సిడెంట్స్కు కారకులు అయ్యారు. అప్పట్లో దీనిపై కేసు కూడా పెట్టారు. కాగా తాజాగా సినిమా పోస్టర్ల్, బ్యానర్లపై ఓ వ్యక్తి హైకోర్టులో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే..
నగరంలో సినిమా ప్రమోషన్స్ భాగంగా రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ సినిమా పోస్టర్లు, బ్యానర్స్ చట్ట విరుద్దంగా వేయడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి.. రోడ్లపై చెత్త చెత్తగా పోస్టర్లను పడేసి పబ్లిక్ న్యూసెన్స్‌ను క్రియేట్ చేస్తున్నారు. అయితే వీటిపై ప్రభుత్వం గానీ ఇతర రాజకీయ పార్టీలు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా పట్టించుకోవడం లేదు. అందువల్ల వీటిని ప్రోత్సాహిస్తున్న ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహాతో పాటు మా అసోసియేషన్, టీఆర్ ఎస్ పార్టీ, ఎంఐఎమ్, టీఎస్ బీజేపీ, టీఎస్ కాంగ్రెస్ లపై హైకోర్టులో ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ కేసుపై విచారించిన కోర్టు.. ఆహా ఓటీటీ, మా అసోసియేషన్, టీఆర్ ఎస్ ఆన్లైన్, ఎఎంఎఐ, టీఎస్ బీజేపీ, టీఎస్ కాంగ్రెస్ లు ఏప్రిల్ 27న కోర్టుకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.