Kollywood: ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ శంక‌ర్‌పై హైకోర్టులో కేసు.. అనుకూలంగా తీర్పు!

Kollywood: ప్ర‌ముఖ త‌మిళ్ ద‌ర్శ‌కుడు శంక‌ర్ పై ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ వారు మద్రాసు హైకోర్టులో ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. త‌మ బ్యాన‌ర్‌లో తాను చేయ‌బోయే ఇండియ‌న్‌-2 చిత్రం పూర్తి కాక‌ముందే మ‌రో కొత్త సినిమా ఒప్పుకోవ‌డం స‌రైన‌ది కాద‌ని.. ఈ సినిమాకు రూ 236కో్ట్లు ఖ‌ర్చు చేశామ‌ని.. శంక‌ర్‌కు పారితోషికంగా రూ.40కోట్ల‌లో రూ.14కోట్లు చెల్లించామ‌ని ఆ నిర్మాణ సంస్థ తెలిపింది. త‌మ సినిమా కంప్లీట్ చేసే వ‌ర‌కు డైరెక్ట‌ర్ శంక‌ర్ మ‌రో సినిమా చేయ‌కుండా స్టే ఇవ్వాల‌ని హైకోర్టును కోరింది. దీనిపై గురువారం విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు శంక‌ర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది.

Director shanker

ఈ పిటిష‌న్ న్యాయ‌మూర్తి పిటి ఆషా స‌మ‌క్షంలో విచార‌ణ‌కు రాగా, శంక‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది వాద‌న‌లు కూడా ఆల‌కించిన త‌ర్వాత‌.. ఆ నిర్మాణ సంస్థ కోరిన‌ట్టుగా తాత్కాలిక స్టే విధించ‌లేమ‌ని, పైగా ఈ కేసులో ద‌ర్శ‌కుడు శంక‌ర్ వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశిస్తూ త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 15వ తేదీకి హైకోర్టు వాయిదా చేసింది. ఈ చిత్రంలో విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. ప‌లు కార‌ణాల వ‌ల్ల ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. దీంతో డైరెక్ట‌ర్ శంక‌ర్‌.. రాంచ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో దిల్ రాజు నిర్మాణంలో ఓ చిత్రం తెర‌కెక్కించ‌డానికి రెడీ అవుతున్నారు.