తిరుమల శ్రీ వెంకటేశ్వర సామి వారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ సినీ కథానాయకి సంయుక్తా మీనన్, యువ కథానాయకుడు ఆకాశ్ పూరీ, ప్రముఖ సినీ గాయని మంగ్లీలు వేర్వేరుగా స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయక మంటపంలో వేద పండుతులు వేద ఆశీర్వచనం ఇవ్వగా, ఆలయ అధికారులు పట్టు వస్ర్తంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆలయం వెలుపల సంయుక్తా మీడియాతో మాట్లాడుతూ… స్వామి వారిని దర్శించడం ద్వార నాకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తేనే నాకు మంచు జరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పార. నేను నటించిన నాలుగైదు సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నట్టు తెలిపారు. అందుకే ఈ ఏడాది చాలా కీలకం అని…. స్వామి వారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చామన్నారు.
ఇక ఆకాశ్ పూరి సైతం మీడియాతో మాట్లాడారు…. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తల్వార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందు రానున్నట్లు తెలిపారు. ఈ నెల ఆఖరులో ప్రారంభం కానుందని…. సినిమా ప్రారంభానికి ముందు స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చానన్నారు. నాన్న పూరి జగన్నాథ్ కొత్త సినిమా కథ రాస్తున్నారని… ఆ సినిమాకి ఇంకా హీరో ఫిక్స్ కాలేదన్నారు. నాన్నతో సినిమ చేయడానికి చాలా సమయం ఉందని తెలిపారు.
ఒక్కసారిగా తిరుమలలో సినీ తారలు తళుక్కు మనడంతో భక్తులు వారితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. సెల్ఫీలు తీసుకుంటూ…. కరచాలనం చేస్తూ తమ అభిమాన నటులకు వారి అభిమానాన్ని వ్యక్త పరిచారు.