Mohanlal: మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మలయాళ పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు ఉన్న ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. కాగా ఇప్పుడు ఆయన వయస్సు 60.. ఆయన వయస్సు ఇప్పుడెందుకంటే.. మన్యంపులి చిత్రంలో ఆయన చేసిన స్టంట్స్ కుర్ర హీరోలకు పోటీగా వస్తున్నట్లు ఉంటాయి. అందుకు కారణం ఆయన ఫిట్నెస్ అధిక ప్రాధాన్యమివ్వటమే. తాజాగా Mohanlal మోహన్‌లాల్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
ఆ వీడియోలో ఆయన జిమ్‌లో ట్రైనర్ పర్యవేక్షణలో పలు వ్యాయామాలు చేస్తూ కష్టపడుతున్నాడు. ఆ వీడియోకు రోజూ వ్యాయామాలు ద్వారా దేహంతో పాటు మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. శారీరక దారుఢ్యంపై అభిమానుల్లో స్ఫూర్తి నింపేందుకు మూడు నిమిషాల వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేశాడు మోహన్‌లాల్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక ఆయన ప్రస్తుతం ఆరట్టు చిత్రంలో నటిస్తున్నాడుMohanlal.