Powerstar: వ‌కీల్‌సాబ్ కోసం డ‌బ్బింగ్ థియేట‌ర్‌లో ప‌వ‌ర్‌స్టార్ హ‌ల్‌చ‌ల్‌!

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ న‌టించిన తాజా చిత్రం వ‌కీల్‌సాబ్ ఉగాది కానుక‌గా ఏప్రిల్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్స్‌ను మొద‌లు పెట్టింది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి టీజ‌ర్‌, సాంగ్స్‌, పోస్ట‌ర్స్ ప్రేక్ష‌కుల‌ను, అభిమానుల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ భాగంగా ప‌వ‌న్ డ‌బ్బింగ్ చెప్పె వీడియోను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. దీంట్లో ప‌వ‌న్ ఎంట్రీ ఇస్తూ స‌త్య‌మేవ జ‌య‌తే సాంగ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వ‌స్తుంది.. ప‌వ‌న్ డ‌బ్బింగ్ థియేట‌ర్‌లో ఈ చిత్ర‌ డైరెక్ట‌ర్ శ్రీ‌రామ్ వేణు తో సంద‌డి చేశాడు.

vakeelsaab dubbing

ఇక ఈ చిత్ర ట్రైల‌ర్‌ను మార్చి 29న రిలీజ్ చేయ‌నున్నారు.. ఇందులో భాగంగానే మొద‌ట‌గా 5.30 నిమిషాల‌కు థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తార‌ట‌.. ఆ త‌ర్వాత వెంట‌నే 6.30నిమిషాల‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా రిలీజ్ చేస్తార‌ట చిత్ర‌బృందం. వ‌కీల్‌సాబ్ చిత్రం ప్రీ రిలీజ్ వేడ‌కును ఏప్రిల్ 3న నిర్వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా.. శ్రుతిహాస‌న్‌, అంజ‌లి, నివేధా థామ‌స్‌, అన‌న్య‌, ప్ర‌కాశ్‌రాజ్ త‌దితరులు న‌టించిన ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ స్వ‌రాలు అందించారు.