రజనీ ఓట్లు కొనలేరు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

రాజకీయాల్లోకి వస్తున్నట్లు గత కొద్దిరోజుల క్రితం ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్.. కొద్దిరోజులకే మాటను వెనక్కి తీసుకోవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యల వల్ల రాజకీయాల్లోకి అడుగుపెట్టకూడదని నిర్ణయించుకున్నట్లు రజనీ ఒక మూడు పేజీల లేఖను విడుదల చేశారు. రాజకీయాల్లోకి రాకపోయినా ప్రజాసేవ చేస్తానని రజనీ తెలిపారు. రజనీ ప్రకటనతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఇంత సడెన్‌గా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోవడం వెనుక రీజన్ ఏంటనే చర్చ జరుగుతోంది.

mohanbabu on rajani politics

రజనీ నిర్ణయంపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో రజనీకి బెస్ట్ ఫ్రెండ్ అయిన టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మోహన్ బాబు సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ సందేశాన్ని పంచుకున్నారు. పాలిటిక్స్ వద్దనుకున్న రజనీ నిర్ణయం అందరినీ బాధకు గురిచేసినా.. తనను మాత్రం సంతోషపెట్టిందన్నారు. రజనీకి అత్యంత సన్నిహితుడిగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసినవాడిగా రజనీ నిర్ణయం ఆనందానికి గురి చేసిందన్నారు. చీమకు కూడా హానీ చేయని రజనీకి రాజకీయాలు సరిపడవన్నారు.

ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం రజనీ లక్షణమని, ఆయన డబ్బులు ఇచ్చి ఓట్లు కోనలేరన్నారు. ‘రాజకీయాలు ఒక రొచ్చు, బురద.. ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో తెలియదు. ఎవరిని నమ్మాలో తెలియదు, ఇప్పుడు పొగిడిన వారు రేపు విమర్శలు చేస్తారు. కాబట్టి రజనీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకోవడం మంచిది’ అని మోహన్ బాబు చెప్పారు.