BIG BREAKING :దేశ ప్రజలకు ప్రధాని మోదీ భారీ గుడ్‌న్యూస్

దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ భారీ గుడ్‌న్యూస్ చెప్పారు. కరోనా వ్యాక్సిన్‌ను జనవరి 16 నుంచి ఇండియాలో పంపిణీ చేయనున్నట్లు మోదీ గత కొద్దిరోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా హెల్త్ ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు 50 ఏళ్లు పైబడిన వారికి అందిస్తామని మోదీ ప్రకటించారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసులు పంపిచామన్నారు. మోదీ ప్రకటనతో కరోనా మహమ్మారితో భయపెడుతున్న దేశ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది.

MODI CORONA VACCINE FREE

ఈ క్రమంలో మోదీ మరో సంచలన ప్రకటన చేశారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకోబోయే వారికయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, రాష్ట్రాలపై ఎలాంటి భారం పడదని చెప్పారు. జులై నాటికి దేశంలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తొలి దశలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన 3 కోట్ల మంది కరోనా యోధులకు అందిస్తామన్నారు. రెండో దశలో 50 ఏళ్లు పైబడిన, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 50 ఏళ్ల లోపు వారికి ఇస్తామన్నారు.