ఫ్ర‌స్ట్రేష‌న్ హీరోల సంద‌డి మొద‌లైంది..

మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ ఇటీవ‌లే క‌రోనా బారిన‌ప‌డి కోలుకున్న విష‌యం తెలిసిందే. అనంత‌రం వ‌రుణ్ తాను చేయ‌బోయే సినిమా షూట్‌లో పాల్గొన్నారు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఎఫ్2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్‌3 చిత్రం రానుంది. ఇందులో కూడా విక్ట‌రీ వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్‌, త‌మ‌న్నా, మెహ‌రీన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తుండ‌గా.. ఇటీవ‌లే విక్ట‌రీ వెంక‌టేశ్‌పై ప‌లు స‌న్నివేశాలు చిత్రిక‌రించారు డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి.

venki-varun

తాజాగా వ‌రుణ్ కూడా ఎఫ్3 సినిమా షూట్‌లో పాల్గొన‌డంతో ఈ సినిమా షూటింగ్ వేగం పుంజుకుంది. ఇక వ‌రుణ్‌తేజ్ క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత తొలిసారి ఈ సినిమా షూట్‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి వ‌రుణ్‌తో ఉన్న ఫోటోను త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశారు. సెట్లోనూ సంద‌డి మొద‌లు కాబోతుందని ఆయ‌న రాసుకొచ్చారు. దీంతో థియేట‌ర్లో న‌వ్వులు పూయించ‌డానికి వ‌స్తున్న ఫ్ర‌స్ట్రేష‌న్ హీరోల‌కు అల్ ది బెస్ట్ అని సోష‌ల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కురుస్తున్నారు.