రేపు విశాఖలో బీచ్ పర్ఫెక్ట్ విత్ “మిస్ పర్ఫెక్ట్” ‘ క్యాంపెయిన్ లో హీరోయిన్ లావణ్య త్రిపాఠీ

పరిశుభ్రతపై అవగాహన కల్పించే ఓ ప్రత్యేక కార్యక్రమంలో భాగమయ్యేందుకు ముందుకొచ్చింది హీరోయిన్ లావణ్య త్రిపాఠీ. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ కొత్త వెబ్ సిరీస్ “మిస్ పర్ఫెక్ట్” లో కీ రోల్ చేసిన అభిజ్ఞ వుతలూరుతో కలిసి లావణ్య త్రిపాఠీ రేపు వైజాగ్ వైఎంసీఏ బీచ్ లో ‘బీచ్ పర్ఫెక్ట్ విత్ “మిస్ పర్ఫెక్ట్” ‘ క్లీనింగ్ క్యాంపెయిన్ లో పాల్గొనబోతోంది. ఈ నెల 30న జాతీయ పరిశుభ్రత దినాన్ని పురస్కరించుకుని రేపు ఉదయం 7.30 నిమిషాలకు ‘బీచ్ పర్ఫెక్ట్ విత్ “మిస్ పర్ఫెక్ట్” ‘ కార్యక్రమాన్ని లోకల్ ఎన్ జీఓ వైజాగ్ వాలంటీర్స్ తో కలిసి లావణ్య త్రిపాఠీ ప్రారంభించనుంది. ఈ నెల 30వ తేదీ నుంచి నాలుగు వాారాల పాటు ఈ క్లీనింగ్ క్యాంపెయిన్ కొనసాగనుంది.

ఫిబ్రవరి 2వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న “మిస్ పర్ఫెక్ట్” వెబ్ సిరీస్ లో మిస్ లావణ్య క్యారెక్టర్ లో నటించింది లావణ్య త్రిపాఠీ. మిస్ లావణ్యకు క్లీన్ నెస్ అంటే ఇష్టం. ఇళ్లు నీట్ గా లేకుంటే ఆమె ఊరుకోదు. వెంటనే రంగంలోకి దిగి మొత్తం శుభ్రం చేస్తుంది. కేవలం రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ పరిశుభ్రతపై అవగాహన కల్పించేలా ఆమె ‘బీచ్ పర్ఫెక్ట్ విత్ “మిస్ పర్ఫెక్ట్” ‘ కార్యక్రమంలో పాల్గొననుంది.

“మిస్ పర్ఫెక్ట్” వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠీ, అభిజీత్ దుద్దాల, అభిజ్ఞ ఉతలూరు కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో “మిస్ పర్ఫెక్ట్” స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.