మొత్తానికి దగ్గుబాటి హీరో రానా తన బ్యాచిలర్ లైఫ్ కి ఎండ్ కార్డ్ పెట్టేశాడు. తన చిరకాల ప్రేయసి మిహీక బజాజ్ ని పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడయ్యాడు. ఇక వారి పెళ్లి వేడుకకు సంబంధించిన అనేక రకాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మిహీక ఫొటోలు చూస్తున్నా చాలా మంది ఆడవాళ్లు ఆమె డ్రెస్ గురించి మాట్లాడుకుంటున్నారు.
ఎందుకంటే మిహీక పెళ్లికి వేసుకున్న బంగారు, క్రీమ్ రంగు లెహంగా డ్రెస్ చాలా ఖరీదైనదని తెలుస్తోంది. డిజైనర్ అనామికా ఖన్నా డిజైన్ చేసిన ఈ డ్రెస్ కోసం రెండు వారాలకు పైగా చర్చలు నడిచాయట. హ్యాండ్ ఎంబ్రాయిడరీతో చేసిన ఈ ఒక్క డ్రెస్ కోసం ₹6 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక హల్దీ వేడుకలో మిహీక పసుపు రంగు డ్రెస్ ధర ₹2 లక్షల వరకు ఉంటుందట. ఇక సమంత పెళ్లిలో వేసుకున్న చీర ధర కూడా లక్షకి పైగానే ఉంటుందని సమాచారం.